Reel vs Real: అటు రీల్ స్టార్లు.. ఇటు రియల్ స్టార్లు.. ఇదే తేడా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోలింగ్‌కు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఓవైపు అధికార వైసీపీ.. మరోవైపు టీడీపీ కూటమి పోటీ పడుతున్నాయి. ఈ సందర్భంగా కూటమి తరపున స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులు రంగంలోకి దిగారు. నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లాంటి స్టార్లు హిందూపురం, పిఠాపురం పోటీచేస్తూనే నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక పవన్ కల్యాణ్ తరపున జబర్ధస్త్ నటులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను తదితరులు ప్రచారం చేయగా.. మెగా కాంపౌండ్ హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వాళ్ళు సైతం ప్రజల్లోకి వెళ్లి కూటమికి ఓటేయాలని అడుగుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. వీరితో పాటు నేచురల్ స్టార్ నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జా, సంపూర్ణేశ్ బాబు ఇలా కూటమి వైపు పెద్ద పెద్ద సినిమా స్టార్లు ప్రచారం చేస్తున్నారు.
కూటమి తరపున ఇలా స్టార్లు ప్రచారం చేస్తుండగా.. ఇటు సీఎం వైయస్ జగన్ సారథ్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలే ప్రచార సారథులుగా ముందుకు సాగుతోంది. ఓవైపు అంతా తానై జగన్ ప్రచారం చేస్తుండగా.. మరోవైపు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో పెన్షన్ కోసం ఇబ్బంది పడిన ఓ తాత... అమ్మఒడి అందుకున్న ఓ అక్క... జగనన్న విద్యా కనుక అందుకున్న ఒక కుర్రాడి తల్లి... ఆసరా అనుకున్న ఓ అక్క... ఇలా పేదలే జగన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ మంచి జరగాలి అంటే మళ్లీ జగన్ గెలవాలి అని ఇంటింటికి వెళ్లి ప్రజలకు చెబుతున్నారు. అటు సినిమా వాళ్లు స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటే.. ఇటు పేదలే స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటూ వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తు్న్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments