ఊహించని ధరలతో రెడ్‌మీ నోట్ 7, నోట్ 7 ప్రొ వచ్చేశాయ్..
Send us your feedback to audioarticles@vaarta.com
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి ఇతర కంపెనీలతో పోటీ పడుతూ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో 'స్మార్ట్గా' ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. నోట్ సిరీస్‌లోనే రెడ్‌మీ నోట్ 7, నోట్ 7 ప్రో ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా రెడ్‌మీ నోట్ 7ను ప్రారంభ ధర రూ.9999గా ఉంచి స్మార్ట్ ఫోన్ ప్రియులందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
రెడ్ మీ నోట్ 7 ఫీచర్స్ :
డిస్ ప్లే: 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్
పిక్సెల్స్ రిజల్యూషన్: 1080x2340
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660 ఆక్టాకోర్
ఆండ్రాయిడ్: 9 పై
స్టోరేజ్: 3జీబీ, 32 జీబీ
ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్: 256 జీబీ
కెమెరా: 12+2 ఎంపీ డ్యుయల్ రియర్
సెల్ఫీ కెమెరా : 13 ఎంపీ
బ్యాటరీ సామర్థ్యం: 4000ఎంఏహెచ్
వీటితో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి ఉంటాయి.
ధరల సంగతి ఇదీ...
3జీబీ/32జీబీ ధర : రూ.9999
4జీబీ/64జీబీ ధర : రూ. 11,999
ఫస్ట్ ఫ్లాష్ సేల్ : ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం ద్వారా మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12గంటలనుంచి ప్రారంభం.
రెడ్ మీ నోట్ 7 ప్రొ
ఇక రెడ్‌మి నోట్ 7 ప్రొ విషయానికొస్తే.. నోట్7 లాగా దాదాపు అన్ని ఫీచర్లను అందిస్తూ.. క్వాల‍్కం స్నాప్ డ్రాగన్ 675 క్రియో ప్రాసెసర్ , 48+5 మెగా పిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరాను అమర్చింది. అంతకు మించి పెద్ద ఫీచర్లేమీ లేవు.
ధరల సంగతి ఇదీ..
4జీబీ, 64జీబీ ధర : రూ.13,999
6జీబీ, 128జీబీ ధర : రూ.16,999
మొత్తానికి చూస్తే.. స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎట్టకేలకు మార్కెట్‌లోకి వచ్చేశాయి. అయితే ఇదివరకు విడుదల చేసిన ఫోన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గానే ఉన్నాయి. అయితే ఇవి ఎంత వరకు మార్కెట్‌ను సొంతం చేసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments