రామ్ `రెడ్` రిలీజ్ డేట్ ఫిక్స్‌

  • IndiaGlitz, [Wednesday,October 30 2019]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం 'రెడ్‌' నేడు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. స్ర‌వంతి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మిళ చిత్రం 'త‌డం'కు ఇది తెలుగు రీమేక్‌. న‌వంబ‌ర్ 16 నుండి ఈసినిమాకు సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆగ‌స్ట్ 9న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని నిర్మాణ సంస్థ అప్పుడే ప్ర‌క‌టించింది. ఈ బుధ‌వారం సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. పూరి, ఛార్మి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. తొలి స‌న్నివేశానికి పూరియే క్లాప్ కొట్ట‌డం విశేషం.

నేను శైల‌జ‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ చిత్రాల త‌ర్వాత రామ్‌, కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీయే 'రెడ్‌'. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దానికి త‌గ్గ‌ట్లు రామ్ లుక్ మాసీగా క‌న‌ప‌డుతుంది. యాక్ష‌న్ థ్రిల్లర్‌గా తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అలాగే పాత్ర కోసం స‌రికొత్త లుక్‌కి మారాడు. ఇస్మార్ట్ శంక‌ర్ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత రామ్ న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రంలో మాళ‌విక‌శర్మ‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

రాజకీయాల‌కే తొలి ప్రాధాన్య‌త‌ : విజ‌య‌శాంతి

``రాజకీయాల‌నేవి పూర్తి అంకిత భావంతో చేయాలి. కాబ‌ట్టి ప్ర‌స్తుతం నా ప్రాధాన్య‌త ముందు రాజ‌కీయాల‌కే`` అని అంటున్నారు

4గంటల పాటు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

ఒకట్రెండు కాదు సుమారు నాలుగు గంటలపాటు సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది.

మోదీ సంచలన నిర్ణయం.. బంగారం లెక్కలు చెప్పాల్సిందే!

దేశంలో నల్లధనం నిర్మూలనకు మూడేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..

రాజ్‌నాథ్‌తో కేటీఆర్ భేటీ.. భూముల అప్పగింతపై చర్చ

తెలంగాణ మంత్రి కేటీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు.

రవితేజ రెమ్యూనరేషన్ పై నిర్మాత మెలిక

మాస్ మ‌హారాజా ర‌వితేజ 66వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.