తెలుగు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్లు ప్రకటించిన కేంద్రం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ వైరస్‌పై పోరులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌ను మే-03 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా రెడ్, ఆరెంజ్ జోన్ల జాబితాను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఏయే జిల్లాలు, ప్రాంతాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. దేశ వ్యాప్తంగా.. రెడ్ జోన్‌లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్‌లో 207, మిగతావి అన్నీ గ్రీన్ జోన్‌లో ఉంటాయి. రెడ్ జోన్‌లు రెండు రకాలు అని.. విస్తృతి ఎక్కువున్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు- ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పులు జరుగుతాయని కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్ జిల్లాలు (లార్జ్ ఔట్‌బ్రేక్):-
ఏపీలో మొత్తం 13 జిల్లాలు ఉండగా 11 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఇంతవరకూ సింగిల్ కేసు కూడా నమోదు కాలేదు.
01. కర్నూలు
02. గుంటూరు
03. నెల్లూరు
04. ప్రకాశం
05. కృష్ణా
06. వైఎస్సార్ కడప
07. పశ్చిమ గోదావరి
08. చిత్తూరు
09. విశాఖపట్నం
10. తూర్పు గోదావరి
11. అనంతపురం
తెలంగాణలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు:-
01. హైదరాబాద్
02. నిజామాబాద్
03. వరంగల్ అర్బన్
04. రంగారెడ్డి
05. జోగులాంబ గద్వాల్
06. మేడ్చల్
07. మల్కాజిగిరి
08. కరీంనగర్
09. నిర్మల్
తెలంగాణలో రెడ్ జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్) జిల్లాలు:-
01. నల్గొండ
తెలంగాణలో ఆరెంజ్ జోన్ (నాన్-హాట్‌స్పాట్) జిల్లాలు:-
01. సూర్యాపేట
02. ఆదిలాబాద్
03. మహబూబ్‌నగర్
04. కామారెడ్డి
05. వికారాబాద్
06. సంగారెడ్డి
07. మెదక్
08. ఖమ్మం
09. భద్రాద్రి కొత్తగూడెం
10. జగిత్యాల
11. జనగాం
12. జయశంకర్ భూపాలపల్లి
13. కుమరంభీమ్ ఆసిఫాబాద్
14. ములుగు
15. పెద్దపల్లి
16. నాగర్ కర్నూలు
17. మహబూబాబాద్
18. రాజన్న సిరిసిల్ల
19. సిద్దిపేట
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout