100% వినోదానికి 'రెడ్ అలర్ట్ ' సిద్ధం
Send us your feedback to audioarticles@vaarta.com
హెచ్.హెచ్.మహాదేవ్, అంజనా మీనన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం రెడ్ అలర్ట్. పి.ఎన్.త్రిలోక్ రెడ్డి సమర్పణలో సినీ నిలయ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రమహేష్ దర్శకత్వంలో పి.వి.శ్రీరాం రెడ్డి నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళం, కన్నడలో అల్రెడి విడుదలైంది. తెలుగులో నవంబర్ 6న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
డైరెక్టర్ చంద్రమహేష్ మాట్లాడుతూ `నా తొలి చిత్రం ప్రేయసి..రావే రిలీజ్ అప్పుడు కూడా నేనింత టెన్షన్ పడలేదు. కన్నడ, మలయాళంలో మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రం తెలుగులో నవంబర్ 6న విడుదలకు సిద్ధమవుతుంది. ఇదొక కామెడి థ్రిల్లర్. నలుగురు యువకులు సిటీకి వచ్చినప్పుడు కర్ఫ్యూ సందర్భంలో ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశారనేదే సినిమా. రవివర్మగారు అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమాను కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు.
హెచ్.హెచ్.మహాదేవ్ మాట్లాడుతూ `రెండు భాషల్లో సినిమా మంచి అప్లాజ్ సంపాదించుకుంది. చంద్రమహేష్, రవివర్మ, కళ్యాణ్ సమీగారు ఇలా మంచి టెక్నికల్ టీమ్ సపోర్ట్ తో మంచి సినిమాను రూపొందించాం. నాన్నగారు మా మధ్య లేరనే బాధ ఉంది. ఆయన ఉండుంటే సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యుండేది. ఆడియో పెద్ద సక్సస్ సాధించింది. అదేవిధంగా నవంబర్ 6న విడుదలవుతున్న సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com