'రెడ్ అలర్ట్' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Thursday,September 03 2015]

ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో రూపొందిన చిత్రం రెడ్ అలర్ట్. చంద్రమహేష్ దర్శకత్వంలో పి.వి.శ్రీరాంరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. పి.యస్‌.త్రిలోక్‌రెడ్డి సమర్పణలో సినీ నిలయ క్రియేషన్స్‌ బ్యానర్‌పై హెచ్‌.హెచ్‌.మహదేవ్‌, అంజనా మీనన్‌ హీరో హీరోయిన్‌గా రూపొందిన ఈ చిత్రానికి రవివర్మ సంగీతం అందించారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమం సెప్టెంబర్ 2 హైదరాబాద్ లో జరిగింది. హీరో రానా థియేట్రికల్ ట్రైలర్, బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు. అనంతరం..

రానా: నిర్మాత శ్రీరాంరెడ్డిగారు, నాన్నగారు మంచి స్నేహితులు. అలా నాకు మహదేవ్ తో మంచి పరిచయం ఉంది. ట్రైలర్ బావుంది. పాటలు, సినిమా పెద్ద సక్సెస్ కావాలన్నారు.

పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి: నిర్మాతగారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోవడం బాధాకరం. నాలుగు భాషల్లో సినిమాని నిర్మించాలనే ఆయన ధైర్యం మెచ్చుకోతగింది. హీరోకి మంచి భవిష్యత్ ఉంటుంది. మలయాళం, కన్నడలో పెద్ద హిట్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళంలో కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానన్నారు.

సంగీత దర్శకుడు రవివర్మ : రెడ్‌ అలర్ట్‌ చిత్రంతో నాలుగు భాషల్లో మ్యూజిక్ డైరెక్టర్ కావడమే కాకుండా ఒక రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాలో నేను కూడా పార్ట్ అయ్యాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. కన్నడ, మలయాళంలో మంచి సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు, తమిళంలో కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఈ అవకాశాన్ని నాకు కలిగించిన శ్రీరామ్‌రెడ్డిగారికి ఋణపడి ఉంటాను. అలాగే చంద్రమహేష్‌గారు నాకు కావాల్సినంత ఫ్రీడమ్‌ను ఇచ్చి మ్యూజిక్‌ చేయించుకున్నారన్నారు.

డైరెక్టర్‌ చంద్రమహేష్‌ : కన్నడ, మలయాళ సినిమా మంచి హిట్‌ను సాధించింది. తెలుగు, తమిళంలో విడుదల కానుంది. రవివర్మ నాలుగు పాటలను చాలా డిఫరెంట్‌గా అందించాడు. అలాగే వెనిగళ్ళ రాంబాబు, శ్రీరామ్‌ తపస్వి, శ్రీవల్లి ఆ ట్యూన్స్‌కి తగిన విధంగా అద్భుతమైన లిరిక్స్ ను రాశారు. నాలుగు భాషల్లో నటించిన సుమన్‌గారు నాకు అవసరమైనప్పుడు డేట్స ఇచ్చి సపోర్ట్ చేశారు. ఈ సినిమాని నాలుగు భాషల్లో రూపొందించినందుకు నాకు రెండు అవార్డులు వచ్చాయి. అయితే ఆ క్రెడిట్‌ అంతా నిర్మాతగారు శ్రీరామ్‌రెడ్డిగారికే చెందుతుంది. ఈ సినిమా చేయడానికి అవకాశం కలిగించిన నిర్మాతగారికి జీవితాంతం ఋణపడి ఉంటాను. నాకు వచ్చిన ఈ అవార్డులను ఆయనకే అంకితం చేస్తున్నాను. సపోర్ట్‌ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్ కి థాంక్స్‌'' అన్నారు.

హీరో హెచ్‌.హెచ్‌.మహాదేవ్‌ : నాన్నగారు మన మధ్య ఉండుంటే బావుండేది. ఆయన ఎక్కడ ఉన్నా మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారని భావిస్తున్నాను. ఆడియో బాగా వచ్చింది. రవివర్మగారు మంచి సంగీతాన్నందించారు. ఇప్పటి రోజుల్లో ఒక సినిమాని చేయడమే కష్టంగా ఉంది. అటువంటిది ఒక సినిమాని నాలుగు భాషల్లో చేయడమంటే మాటలు కాదు. అందుకు కారణం చంద్రమహేష్‌గారు. ఆయన చాలా కష్టపడి సినిమాని డైరెక్ట్ చేశారు. తెలుగు, తమిళంలో త్వరలోనే విడుదల కానుంది. ఇక్కడ కూడా పెద్ద సక్సెస్‌ అవుతుందని నమ్ముతున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్‌ను అభినందించారు. రానా చేతుల మీదుగా డైరెక్టర్‌ చంద్రమహేష్‌ ఇండియన్‌ ఎక్సలెన్సీ అవార్డ్‌, ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ అవార్డులను అందుకున్నాడు. అలాగే స్వామిగౌడ్‌, సుమన్‌ చేతుల మీదుగా చిత్రయూనిట్‌కి అవార్డులను అందించారు. ఇంకా గొట్టిముక్కల పద్మారావు, తమ్మారెడ్డి భరద్వాజ, సుమన్‌, కవిత, జగదీష్‌ గౌడ్‌, సుధాకర్‌ కోమాకుల, మాదాల రవి, హీరోయిన్‌ అంజనా మీనన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ జైపాల్‌రెడ్డి, కో ప్రొడ్యూసర్‌ పిన్నింటి శ్రీరాం సత్యారెడ్డి, వీర శంకర్‌, వెనిగళ్ళ రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సుమన్‌, కె.భాగ్యరాజ్‌, అలీ, పోసాని, వినోద్‌కుమార్‌, రవిప్రకాష్‌ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీరామ్‌ చౌదరి, సంగీతం: రవివర్మ, కెమెరా: కళ్యాణ్‌ సమి, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: వెనిగళ్ళ రాంబాబు, శ్రీరామ్‌ తపస్వి, శ్రీవల్లి, ఫైట్స్‌: హార్స్ మెన్‌బాబు, జాషువ, ఆర్ట్‌: సాయిమణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: జైపాల్‌ రెడ్డి, కో ప్రొడ్యూసర్‌: పిన్నింటి శ్రీరాం సత్యారెడ్డి, ప్రొడ్యూసర్‌: పి.వి.శ్రీరామ్‌ రెడ్డి, స్కీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రమహేష్‌.