దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. తాజాగా 77 వేలకు పైగా కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసుల్లో కొత్త రికార్డులు సాధిస్తోంది. తాజాగా ప్రపంచంలోనే ఒకరోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు చేసుకున్న దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా బుధవారం - గురువారం మధ్య 75,760 కేసులు నమోదు చేసుకుంది. కాగా నిన్న అంతకంటే ఎక్కువ కేసులు నమోదు చేసుకోవడం దేశంలో కరోనా ఎంత భయంకరంగా విజృభిస్తోందో తెలియజేస్తోంది.
కాగా శుక్రవారం హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 77,266 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 33,87,501కి చేరుకుంది. కాగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 1075 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 61,529కి చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,177 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. దేశ వ్యాప్తంగా 25,83,948 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా పడిన వారిలో 76.28 శాతం మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 7,42,023 యాక్టివ్ కేసులున్నాయి. గురువారం ఒక్కరోజే 9,01,338 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout