ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కరోనా హెల్త్ బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 49,553 శాంపిళ్లను పరీక్షించగా.. 6045 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,713కు చేరుకుంది. 6494 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 65 మంది మృతి చెందారు.
కరోనా కారణంగా గుంటూరులో 15 మంది, కృష్ణాలో పది మంది, పశ్చిమ గోదావరిలో ఎనిమిది మంది, తూర్పు గోదావరిలో ఏడుగురు, చిత్తూరులో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖలో ముగ్గురు, కడపలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 823కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,127 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 32,127 మంది డిశ్చార్జ్ అయ్యారు.
#COVIDUpdates: 22/07/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 22, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 61,818 పాజిటివ్ కేసు లకు గాను
*29,390 మంది డిశ్చార్జ్ కాగా
*823 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,605#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ZAIJedU2ZY
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout