ఏపీలో రికార్డ్ స్థాయిలో కేసులు.. నేడు ఎన్నంటే..
- IndiaGlitz, [Friday,July 17 2020]
ఏపీలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేడు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 20,245 శాంపిళ్లను పరీక్షించగా 2602 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏపీకి చెందిన 2592 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మంది, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40,646కు చేరింది. నేడు కరోనా కారణంగా 42 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 534కు చేరుకుంది. ఇప్పటి వరకూ 20,298 మంది కోలుకుని కరోనా నుంచి డిశ్చార్జ్ అవగా.. 19,814 యాక్టివ్ కేసులున్నాయి.
#COVIDUpdates: 17/07/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 17, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 37,751 పాజిటివ్ కేసు లకు గాను
*17,812 మంది డిశ్చార్జ్ కాగా
*534 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 19,405#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/42spNUAOgf