Recce : జూన్ 17 నుండి ZEE5 ప్రసారంకానున్న నోవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ "రెక్కీ"
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీరామ్,శివ బాలాజీ,ధన్య బాలకృష్ణ,ఆడుకలం నరేన్, ఎస్టర్ నోరోన్హా,జీవా,శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్ నటీనటులుగా కృష్ణ పోలూరి దర్శకత్వంలో కేవీ శ్రీరామ్ నిర్మాతగా,ZEE5 నిర్మించిన నోవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ "రెక్కీ". june 17 నుండి ZEE5 లో ఈ వెబ్ సిరీస్ స్క్రీనింగ్ స్టార్ట్ అవుతున్న సందర్బంగా ZEE5 టీం "రెక్కీ" వెబ్ సిరీస్ సీజన్ ను సినీ పాత్రికేయు లకు ప్రదర్శించడం జరిగింది.
షో అనంతరం ZEE5 ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో
ZEE5 చీఫ్ అనురాధ గారు మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథ చెప్పినపుడు చాలా క్యూరియాసిటీ అనిపించింది.ఈ వెబ్ సిరీస్ కు క్యాస్ట్ చక్కటి క్రూ దొరికారు. ఓటిటి అయినా సినిమా అయినా సేమ్ కంటెంట్ ఉంటుంది. దర్శకుడు కృష్ణ పోలూరి గారు మేము అనుకున్న దాని కన్నా చాలా చక్కగా తీశారు.ఈ వెబ్ సిరీస్ జూన్ 17 నుండి ZEE5 లో ప్రసారం అవుతుంది. ఈ సిరీస్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్ లో 1990ల నాటి గ్రిప్పింగ్ పీరియడ్ థ్రిల్లర్ కథ 7 ఎపిసోడ్ల వ్యవధిలో ఒక్కొక్కటి 25 నిమిషాలు నిడివి ఉంటుంది. ఈ "రెక్కీ" వెబ్ సిరీస్ ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో వీక్షకులను కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇందులో శ్రీరామ్,శివ బాలాజీ,ధన్య బాలకృష్ణ,ఆడుకలం నరేన్, ఎస్టర్ నోరోన్హా,జీవా,శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్ ఇలా అందరూ చాలా చక్కగా నటించారు.ఇందులో శ్రీరామ్ గారి మ్యూజిక్,డి. ఓ. పి రామ్. కె. మహేష్ విజువల్స్ అందరిని ఆకట్టుకుంటాయి. టెక్నిషియన్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు.ZEE5 ఎప్పుడూ లోకల్ ట్యాలెంట్ ను గుర్తించి ఎంకరేజ్ చేస్తుంది. ZEE5 కేవలం OTT ప్లాట్‌ఫారమ్ గా మాత్రమే కాకుండా కంటెంట్ పరంగా చూస్తే ZEE5 ఎన్నో మిలియన్ల మంది హృదయాల ఆదరణతో దూసుకు పోతుంది. ZEE5 ఒక జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఫార్మాట్లలో వినోదాన్ని ప్రసారం చేసే విధంగా సినిమా, వెబ్ సిరీస్ లలో అన్ని రకాల జోనర్స్ ను వీక్షకులకు అందించనుంది. ఇటీవలే ZEE5 లో వచ్చిన వెబ్ సిరీస్, ‘గాలివాన’, హిట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు వీక్షకులను ఏంటర్ టైన్ చేసేందుకు రెక్కీ, ఆ తరువాత మా నీళ్ల ట్యాంక్ ఇలా ZEE5 వీక్షకులకు ఎప్పటి కప్పుడు కొత్త కంటెంట్ తో కొత్త వెబ్ సిరీస్ లతో అలరించడా నికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అన్నారు.
నిర్మాత కె. వి శ్రీరామ్ మాట్లాడుతూ.. అనురాధ గారు ట్యాలెంట్ ఉన్న వారిని హంట్ చేసి మరి సెలెక్ట్ చేస్తారు . ఆలా సెలెక్ట్ చేసిన వారే శ్రీకాంత్ పోలూరు. అనురాధ గారు దర్శకుడిని,నన్ను నమ్మి మాతో ఈ ప్రాజెక్ట్ చేయించారు.అందుకు తగ్గట్టే దర్శకుడు కృష్ణ పోలూరి చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని అద్భుతంగా తెరకెక్కించాడు.ఈ రోజు ఈ వెబ్ సిరీస్ ఇంత బాగా వచ్చింది అంటే దానికి ముఖ్య కారణం టీం ఎఫర్ట్. అందరూ ఎంతో కష్టపడ్డారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గారు మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ తీశారు అని మెచ్చుకున్నారు.ఇలాంటి మంచి చిత్రం చేసే అవకాశం ఇచ్చిన ZEE5 వారికి ధన్యవాదాలు అన్నారు.
దర్శకుడు పోలూరు కృష్ణ మాట్లాడుతూ.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ రెక్కీ ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో వీక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది.ఈ వెబ్ సిరీస్ కు వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ సపోర్ట్ చేయడంతో ఈ సిరీస్ చాలా బాగా వచ్చింది. ఈ రెక్కీ వెబ్ సిరీస్, చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి సబ్జెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన ZEE5 అనురాధ గారికి నిర్మాత శ్రీ రామ్ కొలిశెట్టి లకు ధన్యవాదాలు అన్నారు.
హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. ఇందులో హ్యూమర్ కు ఎక్కువ స్కోప్ ఉండదు.కానీ దర్శకుడు అద్భుతమైన డైలాగ్స్ ఇచ్చి ఆ డైలాగ్స్ లోనే హ్యూమర్ ను క్రియేట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ కు సినిమాటోగ్రాఫర్,మ్యూజిక్ ఇద్దరి కాంబో బాగా వర్క్ ఆవుట్ అయింది.ప్రతి ఆర్టిస్ట్ బాగా వర్క్ చేశారు.నిర్మాత శ్రీ రామ్ కొలిశెట్టి, దర్శకుడు పోలూరు కృష్ణ, అనురాధ గార్లకు చాలా థాంక్స్. ఇంత మంచి కంటెంట్ ఉన్న టీం లో నేను పార్ట్ అయినందుకు అలాగే ZEE5 వంటి వండర్ ఫుల్ ట్యాలెంటెడ్ టీం తో వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.ప్రేక్షకులందరూ ZEE5 యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఇందులో ఉండే more కంటెంట్ తో పాటు మా "రెక్కీ" వెబ్ సిరీస్ ను చూడండి చూస్తూనే ఉండిపోతారు అన్నారు.
గెస్ట్ గా వచ్చిన దర్శకులు వేగేష్న సతీష్ మాట్లాడుతూ.. "రెక్కీ" ఎక్కడా బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏమవుతుందో అనే క్యూరియాటీని క్రియేట్ చేశాడు దర్శకుడు.ఈ వెబ్ సిరీస్ ఎక్స్ష్ట్రార్డినరీ ఉంది. అందరూ కలసి గ్రేట్ టీం వర్క్ చేశారు. ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ చేస్తూ చాలా సీజన్స్ తియ్యాలి అన్నారు.
నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ.. అనురాధ గారు మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేస్తారు అనే విషయాన్ని మళ్ళీ ప్రూవ్ చేశారు. ZEE5 లో ఈ వెబ్ సిరీస్ చూసిన ప్రేక్షకులు చాలా సర్పరైజ్ అవుతారు.చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది.నాకు తెలిసి మంచి కథలు అందించే ZEE5 ప్రస్తుతం సౌత్ ఇండియా లో నెంబర్ వన్ అని అనుకుంటున్నాను.నేను సక్సెస్ చూసి చాలా రోజులైంది. అందుకే దర్శకుడు ఫస్ట్ ఇందులో చేయమని అడగినప్పుడు అలోచించి వర్క్ చేశాను.ఈ సిరీస్ చూసిన తరువాత ఇందులో నటించే ఛాన్స్ మిస్ అయ్యి ఉంటే నేను లైఫ్ లాంగ్ బాధ పడేవాన్ని అనిపించింది. ఈ సిరీస్ ను దర్శకుడు అద్భుతంగా తీశాడు.ఇందులో అందరూ చాలా చక్కగా నటించారు ఇంత మంచి వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఇచ్చిన ZEE5 వారికి ధన్యవాదములు అన్నారు.
నటి ఎస్టర్ నోరోన్హా మాట్లాడుతూ.. కథ ఒప్పుకునే టప్పుడు నా పాత్ర పై చాలా డౌట్స్ ఉండేవి. తరువాత డైరెక్టర్ గారు డెడికేటెడ్ గా చేస్తున్న వర్క్ చూసి అడగలేకపోయాను.ఈ రోజు ఈ వెబ్ సిరీస్ చూసిన తరువాత ZEE5 టీం చేసిన ఇంత మంచి వెబ్ సిరీస్ లో నేను పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ.. మా టీం అంతా ఎంతో కష్టపడ్డారు.ఇందులో నటించిన వారంతా మాకెంతో సపోర్ట్ గా నిలిచారు. ZEE5 లో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన అనురాధ గారికి ధన్యవాదములు అన్నారు.
డి.ఓ.పి మాట్లాడుతూ.. మంచి కథకు నేను వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
నటి మదుమిత మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీకాంత్ పోలూరు గారు చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని అద్భుతంగా తెరాకెక్కించాడు.ఈ సిరీస్ ను చూడడానికి వచ్చిన వారంతా బ్రేక్ కావాలనకుండా చూస్తున్నంత సేపు చూస్తూనే ఉండి పోయారు. అందరికీ రెక్కీ అంత బాగా కనెక్ట్ అయ్యింది. శ్రీరామ్, ఎస్తర్, శివ బాలాజీ, శరణ్య, రాజశ్రీ నాయర్,సమ్మెట గాంధీ ఇలా అందరూ చాలా బాగా నటించారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఇంత మంచి కంటెంట్ ను అందిస్తున్న ZEE5 కు ధన్యవాదాలు అన్నారు
నటుడు సురేష్.. చాలా రోజుల తరువాత స్క్రీన్ ప్లే మాట్లాడిన కథ రెక్కీ.. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూడలేదు. శ్రీ రామ్ గారు చాలా బాగా చేశారు.ఇద్దరు శ్రీరామ్ లు కలసి అద్భుతంగా వర్క్ చేశారు.చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది అన్నారు
నటుడు వాసు ఇంటూరి మాట్లాడుతూ.. ఇందులో నటించే అవకాశం వచ్చినా ZEE5 లో రెండు సిరీస్ లు ఒకే సారి స్టార్ట్ ఆయినందున నేను "రెక్కీ" లో నటించ లేకపోయాను. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ చూసిన తరువాత ఇంత మంచి సిరీస్ లో నటించే ఛాన్స్ మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది.సీజన్ 2 లో నేను నటిస్తాననే నమ్మకం ఉంది. ZEE5 వారు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ,గాలివాన, రెక్కీ, త్వరలో వచ్చే మా నీళ్ల ట్యాంక్ ఇలా మంచి మంచి వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ZEE5 వారికి ధన్యవాదాలు అన్నారు.
సమ్మెట గాంధీ మాట్లాడుతూ.. దర్శకుడు, డిఓపి గార్లు కృష్ణార్జులులా ఈ కథ కోసం చాలా కష్టపడ్డారు.ఈ రోజు రెక్కీ చూసిన వారంతా బాగుందని మమ్మల్ని ఆప్రిసియేట్ చేస్తున్నారు.అలాగే "రెక్కీ" పార్ట్ 2 కూడా తియ్యాలని కోరుతూ.అనురాధ గారు నాకు ఇందులో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అందుకు ZEE5 టీం కి, అనురాధ గారికి ధన్యవాదములు అన్నారు
ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ మంచి కంటెంట్ తో తీసిన రెక్కీ వెబ్ సిరీస్ ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
తారాగణం: శ్రీరామ్: లెనిన్, శివ బాలాజీ: చలపతి, ధన్య బాలకృష్ణ: గౌరీ, ఆడుకలం నరేన్: వరదరాజులు, రేఖ: ఎస్టర్ నోరోన్హా, ఎమ్మెల్యే : జీవా, శరణ్య ప్రదీప్: బుజ్జమ్మ , రాజశ్రీ నాయర్: దేవకమ్మ , రామరాజు: రంగనాయకులు , తోటపల్లి మధు: కుళ్లాయప్ప , సమీర్: పోలీస్ ఆఫీసర్ సమ్మెట గాంధీ: పరదేశి , ఉమా దానం కుమార్: బాషా , కృష్ణకాంత్: సుబ్బడు , మురళి: బసవ ,సూర్య తేజ: E.O , మణి: నల్లంజీ , కోటేశ్వర్ రావు: ఎస్పీ సంజయ్ , స్వామి నాయుడు: కానిస్టేబుల్ స్వామి , ప్రభావతి: కానిస్టేబుల్ స్వామి భార్య
సాంకేతిక నిపుణులు: ప్రొడక్షన్ హౌస్: సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ , నిర్మాత: శ్రీ రామ్ కొలిశెట్టి , ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శ్రీకాంత్ పోలూరు , దర్శకుడు: పోలూరు కృష్ణ , కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కృష్ణ పోలూరు , DOP: రామ్. కె. మహేష్ , సంగీతం: శ్రీరామ్ మద్దూరి , యాక్షన్: రాంబాబు , సౌండ్ డిజైనర్: సాయి , ఎడిటర్: కుమార్. పి. అనిల్ , ఆర్ట్ డైరెక్టర్: కార్తీక్ అమ్ము, బాబు , కాస్ట్యూమ్ డిజైనర్: శ్రావ్య పెద్ది , ప్రొడక్షన్ మేనేజర్: రాజేష్ మట్ట , ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ. లింగం & నాని , V.F.X సూపర్వైజర్: పోలోజు విష్ణు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com