Tammineni:రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం..

  • IndiaGlitz, [Tuesday,February 27 2024]

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతు తెలిపిన రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి.. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు తెలిపిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్‌, వాసుపల్లి గణేష్‌లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లేశారంటూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్‌ విప్‌ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ విప్‌ డోలా బాల వీరాంజనేయస్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై విచారణ జరిపిన స్పీకర్‌ తమ్మినేని.. పలుమార్లు ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకున్నారు.

అనంతరం 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డట్లు విచారణలో తేల్చారు. దీంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్‌ సెక్రటరీ జనరల్‌ పీపీకే రామాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో కేవలం వారి పదవులు మాత్రమే కోల్పోతారని పేర్కొంటున్నారు. ఏదైనా క్రిమినల్ కేసుల్లో రెండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తే మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారని స్పష్టంచేస్తున్నారు.

More News

Kothapalli Subbarayudu: జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు(Kothapalli Subbarayadu) జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కొత్తపల్లికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Kalki 2898 AD:6000 సంవత్సరాల మధ్య జరిగే కథ.. 'కల్కి' టైటిల్ సీక్రెట్ చెప్పిన దర్శకుడు..

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి 2898AD(Kalki)’.

CM Jagan:టార్గెట్ చంద్రబాబు.. కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్

సొంత నియోజకవర్గం కుప్పంకే నీళ్లివ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారు.? ఇన్నేళ్లూ ఆయన్ను భరించిన కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు అంటూ సీఎం జగన్ తెలిపారు.

Mohan Babu:నా పేరు వాడితే ఖబడ్దార్.. రాజకీయ నేతలకు మోహన్‌బాబు వార్నింగ్..

ఏపీ ఎన్నికల వేళ తన పేరును కొందరు వ్యక్తులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని అలాంటి చర్యలను ఉపేక్షించేది

TTD Board:టీటీడీ బోర్డులో పలు కీలక నిర్ణయాలు.. రమణదీక్షితులపై వేటు..

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.