దేవి నాగవల్లి ఎలిమినేట్ అవడానికి కారణాలివే...!
- IndiaGlitz, [Monday,September 28 2020]
బిగ్‌బాస్ సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది. అయితే మూడో వారం దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు. నిజానికి ఓటింగ్‌ను బట్టి చూస్తే మెహబూబ్ ఎలిమినేట్ అవ్వాలి. ఓటింగ్ పరంగా మెహబూబ్, దేవి ఇద్దరూ ఇంచుమించు ఒకేలా ఓటింగ్‌ను ప్రభావితం చేశారు. అయితే దేవికి పీఆర్ టీమ్ లేదని తెలుస్తోంది. అలాగే ఆమెకు అభిమానులంటూ ఎవరూ లేరు. ఆమె ఇంటర్వ్యూలు ఆమెకు కొంత నెగిటివిటీని తీసుకొచ్చి పెట్టాయనే చెప్పాలి. మెహబూబ్‌కి కాన్‌స్టెంట్ ఓటింగ్ ఉంది. అందువల్లే మెహబూబ్ సేవ్ అయినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ దేవి ఎలిమినేట్ అవ్వడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినవస్తున్నాయి.
దేవిని కంటెస్టెంట్లు నామినేట్ చేయలేదు. కరాటే కల్యాణికి ఒక బిగ్‌బాంబ్ ఇవ్వడంతో అది ఆమె దేవిపై వేశారు. దీంతో బిగ్‌బాస్ ఆమెను నేరుగా నామినేట్ చేశారు. అయితే ఆమె ఎలిమినేట్ అవ్వడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దేవి టాస్క్‌లో 100 శాతం ఇస్తున్నప్పటికీ.. ఆమె హౌస్‌లో ఇతర కంటెస్టెంట్‌లతో మింగిల్ అవడం లేదు. అలాగే గాసిప్స్ చేయలేదు. ఎప్పుడూ కెమెరా ఎదుట ఫోకస్ అయ్యేందుకు కూడా యత్నించలేదు. ఆట కోసం దేవి హౌస్‌కు వచ్చారు. ఆట మీదనే ఫోకస్ చేశారు. ఇవే ఆమెకు బ్యాక్‌డ్రాప్‌గా నిలిచాయని తెలుస్తోంది. గేమ్‌ని గేమ్‌లా చూసేవాళ్లకు మాత్రం దేవి నామినేషన్‌ని జీర్ణించుకోవడం కష్టం.
కానీ బిగ్‌బాస్‌కు కావాల్సింది.. టాస్క్‌లతో పాటు కంటెంట్ కూడా ఇవ్వగలగాలి. ఓన్లీ టాస్క్‌ల మీదనే ఆధారపడితే రేటింగ్ కష్టం. ముఖ్యంగా ఐపీఎల్ నడుస్తున్న సమయంలో కంటెంట్ కూడా చాలా అవసరమే. దీంతో మెహబూబ్ ఉంటే ఆటలో మజా వస్తుంది. చాలా ఎగ్రెసివ్‌గా ఉంటాడు. ఈ పరంగా చూస్తే.. దేవితో కంపేర్ చేస్తే మెహబూబ్ హౌస్‌లో ఉండటం మంచిదని బిగ్‌బాస్ భావించి ఉండవచ్చని తెలుస్తోంది. ఒకవేళ దేవి, మెహబూబ్‌కి సమాన ఓట్లు వచ్చినప్పటికీ ఈ కారణాలను బిగ్‌బాస్ దృష్టిలో పెట్టుకుని దేవిని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దేవి చాలా పాజిటివ్ దృక్పథంతో బయటకు రావడం విశేషం. ఎక్కడా కూడా కాంట్రవర్శీ జోలికి వెళ్లలేదు.