విమాన ప్రమాదానికి కారణాలివేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
కేరళలోని కోజికోడ్ విమానశ్రయంలో విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలను నిపుణులు అన్వేషిస్తున్నారు. భారీ వర్షం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా రన్‌వే మొత్తం చిత్తడిగా మారిపోయింది. అప్పటికే రెండు సార్లు ఆకాశం చక్కర్లు కొడుతూ ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్‌కు యత్నించింది. మూడో ప్రయత్నంలో భాగంగా పట్టును కోల్పోయింది. మరోవైపు రన్‌వే మీద నిర్ధారిత వేగం కన్నా మించిన వేగంతో ల్యాండింగ్ కావడంతోనే ప్రమాదం జరిగివుంటుందని నిపుణులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
టేబుల్ టాప్ రన్‌వే కారణమా?
కేరళలోని కోజికోడ్‌లో విమాన ప్రమాదం జరిగిన విమానాశ్రయం.. టేబుల్ టాప్ రన్ వేతో కూడినది. టేబుల్ టాప్ రన్‌వే అంటే.. రన్‌వేకి ఇరువైపులా చిన్నపాటి లోయలుంటాయి. విమానం ఏమాత్రం తడబడినా లోయలోకి జారిపోవడం ఖాయం. ఈ కారణంగానే విమాన ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రమాదానికి గురైన విమానంలోని ప్రధాన పైలెట్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన ఎన్నో ప్రశంసాపత్రాలను సైతం అందుకుని ఉన్నారు. అలాంటపుడు ఆయన చాలా అప్రమత్తంగానే ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఓ వైపు వర్షం.. మరోవైపు టేబుల్ టాప్ రన్‌వే కావడంతో విమానం రన్‌వే నుంచి కిందకు పడిపోయి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout