మహేష్ మూవీలో నదియా నటించడం వెనక కారణం ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్నిఎన్.వి.ప్రసాద్ - ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ గా డైరెక్టర్ ఎస్.జె.సూర్య నటిస్తుంటే...ఆయనకు భార్యగా నదియా నటిస్తుందట. అయితే...నదియాని ఎందుకు సెలెక్ట్ చేసారంటే...అత్తారింటికి దారేది, మిర్చి, దృశ్యం, అ ఆ....ఇలా నదియా నటించిన సినిమాలన్నీ దాదాపు పెద్ద విజయాల్ని సాధించాయి.
అందుకనే సెంటిమెంట్ గా ఈ చిత్రం కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే ఆలోచనతో నదియాను సెలెక్ట్ చేసారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. తెలుగు, తమిళ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం సెంటిమెంట్ వర్కవుట్ అయి బ్లాక్ బష్టర్ అవుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com