కమల్, గౌతమి విడిపోవడానికి కారణం ఇదే..!
- IndiaGlitz, [Thursday,November 03 2016]
కమల్ హాసన్, గౌతమిల 13 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాఫ్ పెట్టి విడిపోయిన విషయం తెలిసిందే. అయితే...వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. అది ఏమిటంటే...కమల్ హాసన్ ప్రస్తుతం శభాష్ నాయుడు సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి గౌతమి కాస్టూమ్స్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ కమల్ కుమార్తెగా నటిస్తున్నారు. ఈ సినిమా కాస్టూమ్స్ విషయంలో గౌతమి, శృతిహాసన్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి.
ఆ టైమ్ లో కమల్ శృతిహాసన్ కి సపోర్ట్ చేసారట. అందువలన గౌతమి ఫీలై ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే....కమల్ హాసన్ కు గతంలో కాలికి గాయం అయింది. ఈ విషయాన్ని గౌతమి వెంటనే శృతిహాసన్, అక్షర హాసన్ కు తెలియచేయలేదట. ఈ విషయమై శృతిహాసన్, అక్షర హాసన్, గౌతమి మధ్య డిస్కషన్ జరిగిందట. ఈ సంఘటనతోనే గౌతమి ఈ నిర్ణయం తీసుకుంది అని ప్రచారం జరుగుతుంది.మరి.. ఈ ప్రచారాల పై కమల్ స్పందిస్తారేమో చూడాలి..!