స్వీటీ డబ్బింగ్ చెప్పలేకపోవడానికి కారణం అదేనా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమాల్లోకి కొత్తగా వస్తున్న పరభాషా కథానాయికలు సైతం డబ్బింగ్ చెప్పుకుంటూ అందరి ప్రశంసలను పొందుతున్నారు. అయితే పరిశ్రమకి వచ్చి దశాబ్దం పైనే దాటినా.. తెలుగు భాష బాగా వచ్చినా.. ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్‌లపైనే ఆధారపడుతున్న నటి అనుష్క. సూపర్` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన స్వీటీ.. ఇంతవరకు తన గొంతుని సవరించుకోలేదు.
ఇటీవల భాగమతి` విజయోత్సవ వేడుకలో ఇదే ప్రశ్నను అడిగిన మీడియాకి ఆమె బదులిస్తూ, “నేను తెలుగు చాలా చక్కగా మాట్లాడగలను. కాకపోతే డబ్బింగ్ చెప్పుకునేంత గొప్ప గొంతు కాదు నాది. నా గొంతు అచ్చం చిన్న పిల్లల గొంతులా వుంటుంది. అది నేను చేసే పాత్రలపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంతో.. నేను చేసే పాత్రలకి డబ్బింగ్ చెప్పుకోలేకపోవడం నా దురదృష్టంగా భావిస్తున్నాను. నేను మాట్లాడితే పక్కన కూర్చున్న వారికి కూడా వినపడదు. అందుకే మా ఇంట్లోవాళ్ళు కూడా నన్ను ఆటపట్టిస్తూ ఉంటారు” అని తను డబ్బింగ్ చెప్పలేకపోవడానికి గల కారణాన్ని వివరించింది స్వీటీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments