నితిన్ తో త్రివిక్రమ్ సినిమా చేయడానికి కారణం...
Send us your feedback to audioarticles@vaarta.com
త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్, సమంత కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం అఆ ఈ జూన్ 2న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల నుండే కాదు, విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు పొందింది. అయితే అఆ చిత్రాన్ని త్రివిక్రమ్ నితిన్ తో చేయడానికి రెండు కారణాలున్నాయట.
సన్నాఫ్ సత్యమూర్తి కంటే ముందే త్రివిక్రమ్ నితిన్ తో సినిమా చేయాలని ఫోన్ చేస్తే తను స్పెయిన్ లో ఉండిపోవడం, తన వచ్చే లోపలే సన్నాప్ సత్యమూర్తి డైలాగ్స్ రెడీ అయిపోవడంతో ఆ సినిమాలో పడి బిజీ అయిపోయాడట. నితిన్ చేస్తానని అనుకుని చేయలేకపోయానే అనే ఫీలింగ్ మనసులోనే ఉండిపోయిందట. సన్నాఫ్ సత్యమూర్తి విడుదల తర్వాత ఏ సినిమా చేద్దామా అని ఆలోచించుకుంటూ ఉంటే ఓ రోజు పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ తో మాట్లాడుతూ నితిన్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అతనితో చేయడమే న్యాయం అని చెప్పాడట. దాంతో త్రివిక్రమ్, నితిన్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments