గుంటూరులో యువకుడి చావుకు కారణమేంటి.. !?

  • IndiaGlitz, [Monday,April 20 2020]

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా కాటేస్తున్న తరుణంలో ఘోరం జరిగిపోయింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడని మొహమ్మద్ గౌస్ అనే యువకుడ్ని పోలీసులు కొట్టారని.. దాంతో అతను అక్కడికక్కడే మృ‌తి చెందాడని వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు కొట్టడంతో అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయిన మొహమ్మద్‌ను పోలీస్ వాహనం‌లో ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నిత్యావసర సరుకుల కోసం వెళ్లి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ యువకుడు ముస్లిం కావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ ఘటన సోమవారం ఉదయం 8:40 గంటలకు చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై పోలీసుల తీరు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు, మేధావులు దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా.. చనిపోయిన గౌస్‌కు 28 ఏళ్ల వయసు కాగా.. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో ఆ ఫ్యామిలీ రోడ్డున పడింది.

ఐజీ ఏమన్నారంటే..

మరోవైపు ఈ ఘటనపై గుంటూరు రేంజి ఐజీ ప్రభాకర్‌ రావు మీడియా ముందుకొచ్చారు. ‘సత్తెనపల్లిలో జరిగిన ఘటన దురదృష్టకరం. ఆ యువకుడ్ని వ్యక్తిని ఆపేందుకు అక్కడ విధులు నిర్వహిస్తోన్న ఎస్‌ఐ రమేశ్‌ బాబు ప్రయత్నించారు. అయితే, అప్పటికే షేక్‌ గౌస్‌కు చమటలు పట్టడంతో కిందపడిపోయాడు. దీంతో వెంటనే పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ఆసుపత్రిలో మరణించాడు. గౌస్‌కు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. మృతదేహంపై కూడా గాయాలేవీ లేవు. కచ్చితంగా ఈ ఘటనపై విచారణ జరిపి.. అసలు నిజాలు విచారణలో వెలికితీస్తాము. ఇప్పటికే ఎస్‌ఐను సస్పెండ్‌ చేశాం’ అని ఐజీ చెప్పుకొచ్చారు.

More News

షాకింగ్: ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు.. ప్రభుత్వాలకు వారథిలా.. మరీ ముఖ్యంగా ప్రజలను నిత్యం చైతన్యపరుస్తుండే పాత్రికేయులను కూడా ఈ వైరస్ వదలట్లేదు.

ఇక‌పై డ‌బ్బింగ్ సినిమాల‌కు ఇబ్బందేనా..!

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా స్తంభించింది. ప‌లు దేశాలు కోవిడ్ 19 నుండి బారి నుండి త‌ప్పించుకోవ‌డానికి లాక్‌డౌన్ విధానాన్ని పాటిస్తున్నాయి.

'వ‌కీల్‌సాబ్' కోసం ప‌వ‌న్ ప‌డ్డ క‌ష్టం

సినిమాలకు రెండేళ్లు దూరమై రాజకీయాల్లోనే గడిపిన జ‌న‌సేనాని,ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాడు.

చంద్రబాబుకు చిరు బర్త్ డే విషెస్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టారు.

సినీ కార్మికుల ఆ పని చేయ‌డానికి కూడా సిద్ధ‌మేనంటున్న మెగాస్టార్‌

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతటా లాక్ క్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమంటున్నారు