అందుకే వెంకటేష్ తో చేస్తే ఆడియోన్స్ అంగీకరించరని మోహన్ లాల్ తో చేసాను -చంద్రశేఖర్ ఏలేటి
- IndiaGlitz, [Thursday,August 04 2016]
ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం...ఇలా విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తాజా చిత్రం మనమంతా. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమి, కేరింత ఫేం విశ్వంత్ ప్రధాన పాత్రల్లో చంద్రశేఖర్ ఏలేటి మనమంతా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించారు. విభిన్న కథాంశంతో రూపొందించిన మనమంతా చిత్రాన్ని ఈనెల 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మనమంతా చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో
ఇంటర్ వ్యూ మీకోసం...
హ్యుమన్ డ్రామా కథాంశంగా రూపొందిన మనమంతా చిత్రానికి ఇన్ స్పిరేషన్ ఏమిటి..?
కేవలం ఒక్క సంఘటన కాదు...చాలా సంఘటనలు ఇన్ స్పిరేషన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను.
మీ పర్సనల్ లైఫ్ లేదా ప్రొఫెషనల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు ఏమైనా ఇందులో ఉంటాయి అనుకోవచ్చా?
అలాంటిది ఏమీ లేదు. ఇంతకు ముందు చెప్పినట్టు ఏదో ఒక సంఘటన స్ఫూర్తితో కథను తయారుచేసుకోలేదు. నలుగురు వ్యక్తుల జీవితాల్లోని నాలుగు దశలకు దృశ్యరూపంగా ఈకథ సాగుతుంది. అందులో స్కూల్ కి వెళ్లే పాప, కాలేజీ విద్యార్థి, ఒక మధ్యవయస్కుడు, ఓ గృహిణి వుంటారు. భిన్న వయసులు కలిగిన వీరు ఒక సంఘటన పట్ల ఎలా రియాక్ట్ అయ్యారు..? వారిని నడిపించేది ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. ఈ నాలుగు కథలు చివరిలో ఎలా కలుస్తాయన్నదే ఆసక్తికరంగా వుంటుంది. ఫుల్ ఎమోషన్స్ తో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందర్నీ ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించాను.
మనమంతా చిత్రాన్ని తెలుగు, మలయాళంలో ద్విభాషా చిత్రంగా రూపొందించారు కదా...! నేటివిటీ ప్రాబ్లమ్ రాలేదా..?
మనమంతా తెలుగు, మలయాళం, తమిళ్ కి 100% సరిగ్గా సరిపోయే కథ. ఈ చిత్రంలో మోహన్ లాల్ గారు పోషించిన పాత్రకు ఆయనే న్యాయం చేయగలరు. ఆయన ఓకే అన్నారు కాబట్టే మలయాళంలో కూడా చేసాం. షూటింగ్ చేసేటప్పుడు తెలుగు & మలయాళం రెండు వెర్షెన్స్ షూటింగ్ చేసాం. రెండు లాంగ్వేజెస్ కి స్టోరీ ఒక్కటే కాబట్టి తెలుగు, మలయాళంకు పెద్దగా మార్పులు ఏం చేయలేదు.
తెలుగులో డిఫరెంట్ మూవీస్ చేసే వెంకటేష్ ఉండగా మోహన్ లాల్ ను ఎంచుకోవడానికి కారణం..?
అవును..మనకు వెంకటేష్ గారు ఉన్నారు. ఆయన సినిమాలను ఫ్యామిలీ ఆడియోన్స్ బాగా చూస్తారు కూడా. అయితే..వెంకటేష్ గారికి ఓ ఇమేజ్ ఉంది. ఆయన ఈ సినిమా చేస్తున్నారంటే ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టు నేను తీయలేను. అదే మోహన్ లాల్ గారైతే ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు. అదీ కాకుండా ఈ చిత్రంలో నాలుగు కథలు ఉన్నాయి. వెంకటేష్ గార్ని కేవలం ఒక స్టోరీలోనే చూపిస్తే ఆడియోన్స్ అంగీకరించరు. వెంకటేష్ గారి ఇమేజ్ కి తగ్గట్టు నేను కథ రాస్తే ఖచ్చితంగా సినిమా చేయడానికి ప్రయత్నిస్తాను.
మనమంతా స్ర్కీన్ ప్లే చందమామ కథలు స్ర్కీన్ ప్లే లా ఉంటుందా..?
చాలా సినిమాలు ఉండచ్చు. ఉదాహరణకు వేదం (నవ్వుతూ..)
మనమంతా లో క్యారెక్టర్స్ అన్నీ మిడిల్ క్లాస్ నుంచే తీసుకున్నారు కారణం..?
నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని కాబట్టి వాళ్లు పడే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. మిడిల్ క్లాస్ తో బాగా కనెక్ట్ కాగలను. అలాగే వాళ్ల ఎమోషన్స్ ని బాగా చూపించగలను అందుకే మిడిల్ క్లాస్ క్యారెక్టర్స్ ని ఎంచుకున్నాను.
మీ సినిమాలు ఐతే, అనుకోకుండా ఒకరోజు, సాహసం చిత్రాల్లో మనీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది కారణం..?
ట్రైలర్ లో చూసి మనమంతా లో కూడా మనీ చుట్టూ తిరుగుతుంది అనుకుంటున్నారేమో...ఇందులో అలా ఉండదు. నేను తీసిన ప్రయాణం సినిమా కూడా మనీ చుట్టు ఏమీ తిరగదు.
13 సంవత్సరాల్లో మీరు కేవలం 6 చిత్రాలే చేయడానికి కారణం..?
నాకు స్టోరీ, స్ర్కీన్ ప్లే రాసి డైరెక్షన్ చేయడానికి సంవత్సరంన్నర పడుతుంది. నా ఫస్ట్ ఫిల్మ్ తర్వాత ఉదయ్ కిరణ్ & ప్రత్యూష లతో సినిమా చేయాలనుకున్నాను ఆగిపోయింది. అలాగే ప్రయాణం తర్వాత కూడా ఓ సినిమా ఆగిపోయింది. ఇంకొంచెం స్పీడుగా చేస్తే నేను ఎక్కువ సినిమాలు చేయగలను.
మీరు క్వాలీటీ కోసం గ్యాప్ ఎక్కువ తీసుకుంటారా..?
స్ర్కిప్ట్ పక్కాగా ఉంటే రెండు నెలలో సినిమా తీయచ్చు. అదే స్ర్కిప్ట్ లేకపోతే సినిమా ఆలస్యం అవుతుంది. వేరే వాళ్ల కథను తీసుకుని సినిమా చేయడం అంటే నేను ఫాస్ట్ గా సినిమా తీయగలను. కొంత మంది దర్శకులు ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టోరీ రెడీ చేసేస్తారు కానీ నేను అలా చేయలేను.
మీ సినిమాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అది ప్లాన్ చేసి చేసిందేనా..?
నేను ఎప్పుడూ ప్లాన్ చేసి చేయలేదు. ఆ టైమ్ లో నన్ను ఏది ఇన్ స్పైర్ చేస్తే ఆ పాయింట్ తో సినిమా తీసాను తప్ప డిఫరెంట్ గా ఉండాలని కావాలని ప్లాన్ చేసి తీయలేదు.ఇప్పుడు హర్రర్ మూవీ చేయాలనుకుంటున్నాను.
మీరు ప్రయాణం సినిమాను ప్రొడ్యూస్ చేసారు కదా...ప్రొడ్యూసర్ గా ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి..?
నేను ఎక్స్ పిరిమెంటల్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు నా సొంత బ్యానర్ లో చేస్తాను.
మీ దగ్గర వర్క్ చేసిన హను రాఘవపూడి గురించి ఎలా ఫీలవుతుంటారు..?
ఫ్రౌడ్ గా ఫీలవుతుంటాను. నా అసిస్టెంట్స్ కి ఎప్పుడూ చెబుతుంటాను స్టోరీస్ ప్రిపేర్ చేసుకోండి నిర్మాతలను కలవండి డైరెక్టర్ అవ్వాలి మీరు అని చెబుతుంటాను. అలాగే వాళ్లు అడిగితే నా సలహాలు కూడా ఇస్తుంటాను. డైరెక్టర్ రాధాకృష్ణ కు జిల్ అనే టైటిల్ వద్దు అని చెప్పాను అయినా ఆడియోన్స్ ఆదరించారు (నవ్వుతూ..)
హను పై మీ ప్రభావం ఉంది అంటే మీరే ఏమంటారు..?
నా అసిస్టెంట్స్ కి నా స్టైల్ ఫాలో అవ్వద్దు అని చెబుతుంటాను. కమర్షియల్ ఫార్మెట్ తో కెరీర్ స్టార్ట్ చేసి టాలెంట్ ఫ్రూవ్ చేసుకోమని చెబుతుంటాను. కానీ ఎవరు కూడా అలా చేస్తానని చెప్పడం లేదు.
క్షణం, పెళ్లిచూపులు చిత్రాలు చిన్న బడ్జెట్ లో తీసినా పెద్ద విజయం సాధించవచ్చు అని ఫ్రూవ్ చేసాయి. మారుతున్న ట్రెండ్ పై మీ అభిప్రాయం ఏమిటి..?
కొత్త జనరేషన్ కొత్త ఆలోచనలతో వస్తున్నారు. మల్టీఫ్లెక్స్, ఓవర్‌సీస్ మార్కెట్ మరింతగా విస్త్రృత మవుతుండడంతో ఇలాంటి చిత్రాలకు బాగా హెల్ప్ అవుతుంది.
మీ కథను బట్టి ఏక్టర్ ను సెలెక్ట్ చేస్తారా..? లేక ఏక్టర్ ను బట్టి కథ రాస్తారా..?
నా కథకు ఎవరు సెట్ అవుతారో వాళ్లనే తీసుకుంటాను. కాకపోతే ఒక్కొక్కసారి ఏక్టర్ ను బట్టి కథను మార్చవలసి వస్తుంటుంది. ఒక్కడున్నాడు సినిమాని సూర్య తో చేయాలనుకున్నాను. గోపీచంద్ ఓకే అయిన తర్వాత లవ్ & యాక్షన్ పార్ట్ లో మార్పులు చేసాను.
మోహన్ లాల్ తో ఈ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ చెప్పించడానికి కారణం..?
ఆయన డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డారు. కానీ..మాతృభాష ప్రభావం కొంచెం ఉంటుంది. కమల్ హాసన్ మాట్లాడే తెలుగులో తమిళ్ స్లాంగ్ ఉంటుంది. మనమంతా ఎమోషనల్ ఫిల్మ్. మేమంతా ఆయన డబ్బింగ్ చెప్పడానికి యాప్ట్ అని ఫీలయ్యాం. మూడు టీజర్స్ రిలీజ్ చేసిన తర్వాత మోహన్ లాల్ వాయిస్ కి ఆడియోన్స్ అలవాటుపడ్డారు.
ఈమధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమాలు.?
క్షణం & ఊపిరి చిత్రాలు నాకు బాగా నచ్చాయి. బిజీగా ఉన్నప్పటికీ ఈ రెండు చిత్రాలు చూసాను.
కొంత మంది దర్శకులు స్ర్కిప్ట్ రాయడానికి తమ ఫేవరేట్ ప్లేస్ కి వెళుతుంటారు. మరి..మీరు..?
నేను పని అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేస్తుంటాను. నేను ఇంట్లోనే స్ర్కిప్ట్ రాయడానికి ఇష్టపడుతుంటాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?
మైండ్ లో చాలా ఆలోచనలు వస్తన్నాయి కానీ...నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటి అనేది మనమంతా రిజెల్ట్ పై ఆధారపడుతుంది.