త్రిష పెళ్లి క్యాన్సిల్ కి కారణం ఇదే..!
Send us your feedback to audioarticles@vaarta.com
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్...ఇలా అగ్రహీరోలతో నటించి తెలుగులో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న కథానాయిక త్రిష. తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ సౌత్ లో బాగా పాపులర్ అయిన త్రిష ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అయితే...ఎందుకు తన పెళ్లి క్యాన్సిల్ అయ్యింది అనేది చెప్పలేదు. తాజాగా త్రిష ఈ విషయాన్ని బయటపెట్టింది.
ఇంతకీ కారణం ఏమిటంటే....పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తాను అంటే ఒప్పకోలేదట. అందుకే పెళ్లి వద్దు అనుకున్నాను అని చెప్పింది. పెళ్లి తర్వాత కూడా నటిస్తాను అలా ఒప్పుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏక్టింగ్ కి బ్రేక్ ఇస్తాను అంతే...మిగతా టైమ్ లో నటిస్తూనే ఉంటాను. హీరోయిన్ గా కాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా సరే చనిపోయే వరకు నటిస్తూనే ఉంటాను అంటూ తన మనసులో మాట బయటపెట్టింది త్రిష. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments