ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచేసిన మహేష్‌.. కారణమేంటంటే..

  • IndiaGlitz, [Wednesday,May 19 2021]

కరోనా మహమ్మారి దేశంలో ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి సామాన్యుడు, సెలబ్రిటీ అనే భేదం కూడా చూపడం లేదు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటున్నారు. మనం, మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వమో, రాష్ట్ర ప్రభుత్వమో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మన కోసం మనమే జాగ్రత్తలు పాటించాలి. ఎవరికి వాళ్లు తగు జాగ్రత్తలు పాటిస్తే కరోనాకు త్వరలోనే చెక్ పెట్టేయవచ్చు. ఈ దిశగానే సూపర్ స్టార్ మహేష్ బాబు అడుగులు వేస్తున్నాడు.

ఇప్పుడు ఏ సినిమాలు రిలీజ్‌లు లేవు... తన పుట్టినరోజు కూడా కాదు.. ఇక ఫ్యాన్స్ హడావుడి ఏముంటుంది. అయినా ఒకవైపు లాక్‌డౌన్. ఉదయం 4 గంటల పాటు సడలింపు ఇచ్చినప్పటికీ ఎవరి పనులు వారికి సరిపోతున్నాయి. ఈ నాలుగు గంటల్లో తమ ఇంటికి కావల్సిన వస్తువులు కొని తెచ్చుకోవడంతోనే సరిపోతోంది. అయితే మహేష్ బాబు మాత్రం ఉన్నఫళంగా తన ఇంటి ముందు సెక్యూరిటీని భారీగా పెంచేశాడు. ఇది ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఎందుకు మహేష్ తన ఇంటి ముందు ఇంతలా సెక్యూరిటీని పెంచారనేది చర్చనీయాంశంగా మారింది.

మహేష్‌బాబు. హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద సెక్యూరిటీని భారీగా పెంచారు. ఇంట్లో పనిచేసేవాళ్లు మినహా వేరెవ్వరినీ ఇంట్లోకి రానివ్వడంలేదు. పైగా ఇంట్లో పనిచేసేవారికి ప్రతి రోజూ కరోనా టెస్టులు చేయించిన మీదటే లోపలికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే మహేష్‌బాబు వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. త్వరలో సెకండ్ డోస్ తీసుకోనున్నారు. కాబట్టి సెకండ్ డోస్ తీసుకునేవరకూ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించారు. అందుకే షూటింగ్‌లు బంద్ చేసుకుని.. ఇంట్లో ఉండడమేకాదు.. బయటనుంచి వచ్చేవారి కారణంగా కరోనా మహమ్మారి రాకూడదనే ఉద్దేశంతో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూటింగ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ ఆన్‌లైన్ ద్వారా దర్శక నిర్మాతలకు టచ్‌లోనే ఉన్నారట.

More News

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విజయ్‌కాంత్

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

యుద్ధం చేస్తున్నాం.. ఇప్పుడు వద్దు : ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్ని ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల అభిమానులు ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. కేక్ కటింగ్స్, అన్న దాన కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తుంటారు.

తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందజేసిన నిధి

కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.

రష్మికకు విజయ్ దేవరకొండ ప్రపోజ్ చేశాడా ? వీడియో వైరల్

సెలెబ్రిటీల మధ్య ఎఫైర్ స్టోరీలు అల్లేయడానికి నెటిజన్లకు చిన్న అవకాశం దొరికినా చాలు. అది నిజామా, అబద్దమా, మ్యాటర్ ఏంటి..

డైరెక్టర్ చేతులు పట్టుకుని అడిగాడు.. పవన్ కి ముందే తెలుసు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ పూలబాటేమీ కాదు. మెగాస్టార్ సోదరుడిగా సులువుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ దొరికింది.