సందీప్ కిష‌న్ సినిమా పేరు మారుతోంది.. కార‌ణం ఇదేనా?

  • IndiaGlitz, [Monday,March 15 2021]

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘రౌడీ బేబీ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. సినిమా సెట్స్‌కు వెళ్ల‌డానికి ముందే ఈ టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మారింద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి ఇప్పుడు ‘గ‌ల్లీ రౌడీ’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ మార‌డానికి ప్రధాన కార‌ణం నిర్మాత దిల్‌రాజు అని గుస‌గుస‌లు వినప‌డుతున్నాయి.

అందుకు కార‌ణం.. దిల్‌రాజు, త‌మ్ముడు మ‌రో నిర్మాత అయిన శిరీష్ త‌నయుడు అశిష్ రెడ్డి హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు రౌడీ బాయ్స్ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ టైటిల్‌ను ప్ర‌క‌టించాల‌నుకుంటున్నారు. అయితే ఈ రెండు టైటిల్స్ ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో ప్రేక్ష‌కుల్లో లేనిపోని క‌న్‌ఫ్యూజ‌న్ క్రియేట్ అవుతుంద‌ని భావించిన దిల్‌రాజు, రౌడీ బేబీ స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్‌, ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ల‌ను క‌లిసి టైటిల్ మార్చకోమ‌ని రిక్వెస్ట్ చేశాడ‌ట‌. స‌రేన‌ని, దిల్‌రాజు కోరిక మేర‌కు సందీప్ సినిమా టైటిల్‌ను గ‌ల్లీ రౌడీ అని అనుకుంటున్నార‌ట నిర్మాత‌లు ఇప్పుడు. ‌