ఆ కారణంగా రవితేజ సినిమాను పక్కన పెట్టేశాడా..?
- IndiaGlitz, [Friday,December 25 2020]
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలకు ఓకే చెబుతూ దూసుకెళ్తున్నారు. ఓ సినిమా సెట్స్‌లో ఉండగానే మరో సినిమాలో నటించడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. రీసెంట్‌గానే 'క్రాక్' సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన రవితేజ, వెంటనే రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాలో నటించడానికి సెట్స్‌లో జాయినయ్యాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే మరో సినిమాకు ఓకే చెప్పడానికి రవితేజ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. రవితేజ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు కథలతో సిద్ధంగా ఉన్నారు. రీసెంట్ టైమ్స్‌లో రవితేజ, మారుతి కాంబినేషన్లో సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమైంది. కథంతా ఓకే అయినా రెమ్యునరేషన్ విషయంలో రవితేజకు, నిర్మాతలకు డీల్ కుదరలేదట. రెమ్యునరేషన్ విషయంలో రవితేజ ఓ నెంబర్ చెప్పాడట. అయితే నిర్మాతలు ప్రస్తుతం ఆయనకున్న రెమ్యునరేషన్ ఇస్తామని అన్నారట. అందుకు రవితేజ ఒప్పుకోలేదని, తాజా రెమ్యునరేషన్ లో మూడో భాగాన్ని ఎక్కువగా కలిపి అడిగాడని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ అంత పెద్ద మొత్తం అడగటంతో రవితేజ మారుతి సినిమాను పక్కన పెట్టి మరో సినిమాను లైన్లో పెట్టడానికి రవితేజ ప్రయత్నాలు చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.