Ram Charan:హైదరాబాద్‌లో అయ్యప్ప మాలలో .. న్యూయార్క్‌లో సూటు బూటుతో రామ్ చరణ్, ఇదెలా సాధ్యం
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు తెలుగు చిత్ర సీమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ చూపు.. ఆర్ఆర్ఆర్ సినిమాపైనే వుంది. ఆస్కార్ అవార్డ్స్ బరిలో ఈ చిత్రం వుండటంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ అంతా అమెరికాకు పయనమైంది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ అద్భుత నటనతో పాటు ఆర్ఆర్ఆర్లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు అభిమానులు ఉర్రూతలూగించాయి. ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే.
అమెరికాలో రాజమౌళి లాబీయింగ్:
బెస్ట్ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వివాదంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్ బరిలో నిలిచింది. దీంతో ఆస్కార్ ఖచ్చితంగా దక్కుతుందని యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే జక్కన్న తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కెమెరూన్తోనూ ఆయన మిలాఖత్ అయ్యారు. అటు మీడియా కంట్లో పడేందుకు కూడా లాబీయింగ్ చేస్తున్నారు.
రామ్‌చరణ్‌పై ట్రోలింగ్ :
ఇదిలావుండగా.. మార్చి 12న జరిగే ఆస్కార్స్ ప్రదానోత్సవంలో పాల్గొనాల్సిందిగా చిత్ర యూనిట్‌కు ఆహ్వానం అందింది. దీనిలో భాగంగా రామ్‌చరణ్ మంగళవారం రాత్రి న్యూయార్క్ బయల్దేరి వెళ్లారు. అయితే హైదరాబాద్‌లో విమానం ఎక్కే సమయంలో చెర్రీ అయ్పప్ప మాలలో వున్నారు. చివరికి పాదరక్షలు కూడా లేకుండా ఫ్లైట్ ఎక్కేశారు చెర్రీ. కానీ న్యూయార్క్‌లో మీడియాకు కనిపించిన సమయంలో మాత్రం చరణ్ మాలలో లేరు. సూట్, బూట్‌తో స్టైలీష్‌గా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. దీక్షలో వుండగా మాలను మధ్యలో ఎలా విడిచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చెర్రీ శాస్త్రోక్తంగా 21 రోజుల తర్వాత తన స్వామి మాలను విడిచినట్లుగా తెలుస్తోంది. న్యూయార్క్‌లోని హిందూ దేవాలయంలో స్వామి మాలను విడిచారు చరణ్. సో.. అదన్న మాట అసలు మ్యాటర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments