అందుకే..పూరి గోల్కండలో ప్లాన్ చేసాడా
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కళ్యాణ్ రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం గోల్కండ కోటలో క్లైమాక్స్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. అయితే...పూరి గోల్కండ కోటలో షూటింగ్ చేయడం వెనక ఓ ప్రత్యేక కారణం ఉందట.
అది ఏమిటంటే...మహేష్ బాబు - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన పోకిరి చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సంచలన చిత్రం పోకిరి ఇంటర్వెల్ ఎపిసోడ్ ను గోల్కండ కోటలోనే చిత్రీకరించారు. అందుచేత సెంటిమెంట్ గా భావించి పోకిరి రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయాలనే ఇజం క్లైమాక్స్ సీన్స్ ను గోల్కండ కోటలో చిత్రీకరిస్తున్నారట. ఈ నెల మొదటివారంలో స్పెయిన్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 29న ఇజం చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి...సెంటిమెంట్ వర్కవుట్ అయి ఇజం సంచలన విజయం సాధిస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments