బీజేపీకి పవన్ షేక్ హ్యాండ్.. అందుకే ట్వీట్లు డిలీట్ చేశారా?
- IndiaGlitz, [Monday,November 25 2019]
జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ట్విట్టర్ వేదికగా ప్రజా సమస్యల్ని వినిపిస్తూ.. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిం చే పవన్... ఉన్నట్టుండి ట్వీట్లు డిలీట్ చేశారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బీజేపీతో దోస్తీ కట్టే ప్రయత్నం లోనే ... ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ పై చేసిన విమర్శలను తొలగించారని మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళింది కూడా అందుకే అని అనుకుంటున్నారు. అంతే కాదు జనసేన ను బీజేపీ లో విలీనం చేస్తాడని చెబుతున్నారు.
కానీ.. ఈ సమయంలో పవన్ ఈ పని చేస్తే విమర్శలు ఎదుర్కోక తప్పదు. అందుకే జగన్ ను ఎదుర్కునేందుకు బీజేపీకి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఏపీలో బీజేపీ పుంజుకోవడానికి సరైన నాయకుడు లేకపోవడం తో పవన్ తో స్నేహం చేసేందుకు ఒకే చెప్పినట్లు ఉన్నారు మోడీ. ఢిల్లీ పర్యటన సమయంలో ఈ డీల్ జరిగిందని .. అందుకే పవన్ ఎన్నికల సమయంలో చేసిన ట్వీట్ డిలీట్ చేశారు అని నిర్ధారణకు వస్తున్నారు.