నానితో త్రివిక్ర‌మ్ అదే కార‌ణ‌మా..?

మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌డానికి హీరోలంద‌రూ ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠ‌పురుమ‌లో చిత్రంతో భారీ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు త్రివిక్ర‌మ్‌. త‌దుప‌రి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించేశారు. కానీ త్రివిక్ర‌మ్ స్పీడుకు క‌రోనా వైర‌స్ బ్రేకులేసింది. ఎందుకంటే.. యంగ్ టైగ‌ర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ట్రిపుల్ ఆర్ చిత్రంలో కొమురం భీమ్ పాత్ర‌ను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యితే కానీ.. మ‌రో సినిమాను ఎన్టీఆర్ మొద‌లుపెట్టడానికి వీలులేదు. ఇంకా ట్రిపుల్ ఆర్ షూటింగ్ స్టార్ట్ కాలేదు.

ట్రిపుల్ ఆర్ సినిమాను పూర్తి చేసిన‌ త‌ర్వాతే త్రివిక్ర‌మ్ సినిమా మొద‌ల‌వుతుంది. కానీ జ‌న‌వ‌రి నుండి గురూజీ ఖాళీగానే ఉంటున్నారు. ఇంకా వెయిటింగ్‌లో ఉండాల్సిన ప‌రిస్థితి అందుక‌నే త్రివిక్ర‌మ్ ఓ ప్లాన్ చేశాడ‌ట‌. గ్యాప్‌లో సినిమాను త్వ‌ర‌గా పూర్తి చేసెయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ఈ కోవ‌లో త్రివిక్ర‌మ్ హీరో రామ్‌తో సినిమా చేస్తాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజా స‌మాచారం మేర‌కు నేచుర‌ల్ స్టార్ నానితో త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌బోతున్నాడ‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.