మోదీని 'మంచు' కలవడం వెనుక కారణలివీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వడంతో రకరకాలుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిగో వైసీపీకి టాటా చెప్పేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని పెద్ద ఎత్తున టీవీల్లో కథనాలు వచ్చేశాయ్. అంతేకాదు.. మొదట మోదీతో భేటీ అయిన ఆయన.. కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని వార్తలొచ్చాయ్. మరీ ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్.. మోహన్ బాబుకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తితోనే ఇలా బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని అనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయ్. అయితే ఇలా చిత్రవిచిత్రాలుగా వార్తలు వస్తుండటంతో ఈ వ్యవహారంపై ఎట్టకేలకు స్పందించిన మంచు కుటుంబం అసలేం జరిగింది..? ఎందుకు ఢిల్లీలో మోదీని కలవాల్సి వచ్చింది..? అనే విషయాలపై వివరణ ఇచ్చుకుంది.
ఇదీ కారణం..!
మోదీతో జరిగిన భేటీపై మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులతో ఒక్కసారి సమావేశం నిర్వహించాల్సిందిగా మోదీని కోరాను. ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారు.. అంగీకరించారు. త్వరలోనే ఈ భేటీ ఉంటుంది. విష్ణుమూర్తి దశావతారాలతో కూడిన పెయింటింగ్‌ను మోదీకి బహూకరించాం’ అని విష్ణు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
రాజకీయం కాదండోయ్ బాబూ..!
‘మోదీని కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు’ అని స్పష్టం చేసింది మంచు లక్ష్మీ. అయితే ఇటీవలే బాలీవుడ్ యాక్టర్లంతా మోదీని కలవడం.. వీరిలో సౌతిండియన్ స్టార్స్ లేకపోవడంతో పెద్ద రచ్చే జరిగింది. అయితే.. సౌతిండియా స్టార్లతో కూడా సమావేశం ఏర్పాటు చేయాలని.. మోదీని మంచు లక్ష్మీ కోరింది. ఈ క్రమంలో లీడింగ్ బాధ్యత లక్ష్మినే తీసుకోనుందని దీన్ని బట్టి తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ జరిగిన భేటీలో మోదీ నుంచి మాట తీసుకున్న ఆమె త్వరలోనే.. సౌత్ యాక్టర్లందరినీ కలుపుకొని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి మీట్ అవుతారని తెలుస్తోంది. మరి ఈ కార్యక్రమానికి ముహూర్తమెప్పుడో ఏంటో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com