మోదీ గడ్డం వెనుక అసలు కారణం ఇదేనట...

ప్రధాని మోదీ ఇటీవల కొంతకాలంగా తెల్లటి గడ్డంతో మెరిసిపోతున్నారు. అయితే ఇంత సడెన్‌గా ఆయన గడ్డం అలా ఎందుకు పెంచుతున్నారనే దానిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు బీజేపీ, మోదీ అనుచరులు మాత్రం ఆయనను రవీంద్రనాథ్ ఠాగూర్‌తో పోల్చి ఖుషీ అవుతున్నారు. మరికొందరు అసలు ఆయన గడ్డం పెంచడానికి వెనుక ఏమైనా స్కిన్ డిసీజ్ ఏమైనా ఉండి ఉంటుందా? అని ఆలోచిస్తున్నారు. మరికొందరు.. అసలా గడ్డం పెంచడం వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా.. ఆయన గడ్డం వెనుక కారణం ఇన్నాళ్లకు తెలిసింది.

ఏది ఏమైతేనేమి.. ఇటీవలి కాలంలో మోదీ గడ్డం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆయన గడ్డం ఎందుకు పెంచుతున్నారనే దానిపై ఉడుపి పెజావర పీఠాధిపతి, అయోధ్య రామమందిర ట్రస్టు సభ్యుడు విశ్వప్రసన్నతీర్థ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం కర్ణాటకలోని బాగల్కోటెలో విశ్వప్రసన్నతీర్థ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేశారని, మందిరాన్ని సైతం పూర్తి చేసే బాధ్యతను కలిగి ఉన్నారని చెప్పారు. ఇటువంటి చరిత్రాత్మక నిర్మాణాలు చేపట్టే సమయంలో కేశాలను తొలగించరని, మోదీ గడ్డం, జుట్టు కత్తిరించకపోవడానికి ఇదే కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు.