మంచు మనోజ్ ప్రెస్ మీట్ కు కారణమదే....
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు మనోజ్ కాంట్రవర్సీ ప్రెస్‌మీట్ ఏంటా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంచు మనోజ్‌కు షూటింగ్ ఎదురైన అంశమే దీనికి కారణమని తెలిసింది. గత కొన్నాళ్లుగా మంచు మనోజ్ వైజాగ్‌లో ఉన్నారు. ఆయన తాజా చిత్రం షూటింగ్ అక్కడ జరుగుతోంది. ఈ సినిమాను అచ్చిరెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం అధికారికంగా ఆయా సంఘాల్లో రిజిస్టర్ చేసుకున్న జూనియర్ ఆర్టిస్టులను పిలిపించారు. కానీ స్థానిక జూనియర్ ఆర్టిస్టులను ఆ సినిమాలో వినియోగించుకోవాలని కొంతమంది పట్టుబట్టారు. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి వాగ్యుద్ధం చేశారు. అంతటితో ఆగక అచ్చిరెడ్డిపై చేయి చేసుకున్నారని వినికిడి. ఎస్.ఎన్.రెడ్డి మాత్రం అక్కడి నుంచి బయటపడ్డారట. అదంతా గమనించిన మంచు మనోజ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు ఇప్పించడమే కాకుండా, ప్రెస్‌మీట్‌ను కూడా కండెక్ట్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments