మ‌నోజ్ లేఖ వెనుక కార‌ణ‌మేంటి?

  • IndiaGlitz, [Sunday,October 21 2018]

మంచు మ‌నోజ్ ప్ర‌స్తుతం ఆప‌రేష‌న్ ధుర్యోధ‌న 2019లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. హీరోగా మ‌రే సినిమాను అంగీక‌రించ‌డం లేదు. అయితే ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న రాసిన లేఖ ట్రెండింగ్‌లో ఉంది. ప్ర‌తి మ‌నిషికి మ‌న‌శ్శాంతి ఎంతో ముఖ్యం. రెస్టారెంట్స్‌లో కూడా ప‌నిచేశాను. సినీ కెరీర్‌లో కూడా నా వంతు ప్ర‌యత్నాలు చేస్తున్నాను. ప్ర‌పంచ‌మంతా తిరిగిన నాకు మ‌న‌శ్శాంతి ఎక్క‌డ దొరుకుతుంద‌ని అన్వేషించ‌గా.. అది తిరుప‌తిలోనే దొరుకుతుంద‌ని భావిస్తున్నాను.

తిరుప‌తిలో ఓ కొత్త ప్ర‌యాణం మొద‌లుపెట్టి ప్ర‌పంచ‌మంతా దాన్ని విస్త‌రింప‌చేయాల‌నుకుంటున్నాను. కొన్ని నెల‌లు పాటు తిరుప‌తిలోనే ఉండాల‌నుకుంటున్నాను. ఇదే త‌రుణంలో త‌న సినిమా కెరీర్‌క ఫుల్ స్టాప్ పెట్ట‌లేద‌ని తెలిపారు. వేయ‌బోయే త‌ర్వాత అడుగు అంద‌రికీ తెలుస్తుంది అని మ‌నోజ్ తెల‌ప‌డం వెనుక అంద‌రిలో అస‌లు.. మ‌నోజ్ ఈ లేఖ‌ను రాయ‌డంలో అర్థ‌మేంట‌నే ఆస‌క్తి నెల‌కొంది.