కంచె గురించి మహేష్ స్పందించడానికి కారణం అదేనా...?

  • IndiaGlitz, [Friday,September 04 2015]

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం కంచె. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. రొటీన్ చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఉండే వైవిధ్య‌మైన క‌థ‌, క‌థ‌నంతో రూపొందుతున్న కంచె చిత్రాన్ని గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఇటీవ‌ల రిలీజ్ చేసిన కంచె ట్రైల‌ర్ కు అటు ఆడియోన్స్ నుంచి ఇటు ఇండ‌స్ట్రీ నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కంచె ట్రైల‌ర్ చూసి చాలా బాగుందంటూ ట్వీట్ చేసాడు. బాగానే ఉంది. కానీ మ‌హేష్‌ కంచె సినిమా ట్రైల‌ర్ గురించి స్పందించ‌డం వెనుక ఓ కార‌ణం ఉంద‌ట‌.

అదేమిటంటే...క్రిష్...మ‌హేష్ తో శివ‌మ్ అనే సినిమా చేయాల‌ని గతంలో ప్ర‌యత్నించాడు. అశ్వ‌నీద‌త్ ఈ సినిమాని నిర్మించాల‌నుకున్నాడు. అయితే....క్రిష్ క‌థ విన్న మ‌హేష్ కొన్ని మార్పులు చెప్పాడ‌ట‌. మ‌హేష్ చెప్పిన మార్పులు చేస్తాన‌న్న క్రిష్...ఆత‌ర్వాత వేరే సినిమాలో బిజీ అవ్వ‌డం... మ‌హేష్ కూడా ఫుల్ బిజీ... అవ్వ‌డంతో శివ‌మ్ ప్రాజెక్ట్ అట‌కెక్కింది. అప్పుడు మ‌హేష్ కి చెప్పిన క‌థ‌నే ఇప్పుడు వ‌రుణ్ తేజ్ కంచె సినిమా అట‌. అందుకే కంచె కు క‌నెక్ట్ అయి మ‌హేష్ ట్విటాడ‌ట‌...అదీ... ట్విట్ట‌ర్ లో మ‌హేష్ మాట‌ల వెనుక మ‌ర్మం.

More News

'బ్రూస్ లీ' కామెడి ?

మార్షల్ ఆర్ట్స్ లో నెంబర్ వన్ అయిన బ్రూస్ లీ కామెడి చేయడమేంటని అనుకుంటున్నారా. ఆయన గురించి కాదులేండి.

ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడా...నితిన్...?

నితిన్ తో సినిమా చేయాలని మల్లిడి వేణు అనే యువదర్శకుడు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు.మల్లిడి వేణు చెప్పిన కథ నచ్చి నితిన్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు

'జయసూర్య' మూవీ రివ్యూ

మాస్ సినిమాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల విశాల్ చేసిన ఇంద్రుడు, పల్నాడు సినిమాలను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది.

'భలే భలే మగాడివోయ్' మూవీ రివ్యూ

‘ఈరోజుల్లో’ సక్సెస్ తో తొలి సక్సెస్ అందుకున్న మారుతి తర్వాత ‘బస్ స్టాప్’ తో రెండో హిట్ కూడా అందుకున్నాడు. అయితే అంతే రేంజ్ లో తనపై విమర్శలు కూడా వచ్చాయి. దాంతో స్టయిల్ మార్చి ‘ప్రేమకథాచిత్రమ్’ తో సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత వచ్చిన ‘కొత్త జంట, లవర్స్’ మంచి విజయాలు సాధించిన మారుతి అనుకున్న స్థాయి విజయాలను మాత్రం తెచ్చిపెట్టలేదు.

విష్ణు ఆ..డైరెక్టర్ తో సినిమా చేస్తున్నడా....?

మంచు విష్ణు తాజా చిత్రం డైనమేట్ రిలీజ్ అయ్యిందో లేదో...అప్పుడే తన తదుపరి చిత్రం ప్రారంభోత్సవం చేయడానికి రెడీ అవుతున్నాడు.