వంశీ కథ అందుకే నచ్చలేదా?
Send us your feedback to audioarticles@vaarta.com
`మహర్షి` చేసిన తర్వాత ఓ సినిమా మాత్రమే చేసిన సూపర్‌స్టార్ మహేశ్ దర్శకుడు వంశీ పైడిపల్లికి డైరెక్టర్‌గా మరో అవకాశం ఇచ్చాడు. వంశీ చెప్పిన పాయింట్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయమని మహేశ్ చెప్పాడు. దాంతో దాదాపు ఏడెనిమిది నెలలు పాటు వంశీ పైడిపల్లి ఈ కథపై కూర్చున్నాడు. తీరా మహేశ్ రీసెంట్‌గా స్క్రిప్ట్ విని పెదవి విరిచేశాడు. దాంతో వంశీ పైడిపల్లికి షాక్ తగిలింది. అయితే ఇంత టైమ్ ఇచ్చిన వంశీ కథను ఎందుకు తయారు చేసుకోలేకపోయాడు అనే కోణంలో సినీ వర్గాలు ఆలోచనలో పడ్డాయి.
నిజానికి వంశీ పైడిపల్లి మంచి దర్శకుడు. అయితే కథలను డెవలప్ చేయడంలో తను ఇతర రచయితలపై ఆధారపడుతుంటాడు. మున్నా సినిమా తర్వాత వంశీ పైడిపల్లికి కొరటాల శివ రైటర్‌గా అండ దండలు అందించాడు. కొరటాల డైరెక్టర్‌గా మారిపోయాడు తర్వాత.. సాల్మన్, హరి వంశీకి రైటర్స్‌గా తమ సపోర్ట్‌ను అందిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వీరిలో సాల్మన్ కూడా రీసెంట్‌గా వైల్డ్ డాగ్‌తో డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇప్పుడు వంశీకి హరి తప్ప.. మరో రైటర్ అండ లేకుండా పోయింది. ఆ ఫలితంగా వంశీ అనుకున్న స్థాయిలో కథను సిద్ధం చేయలేకపోయాడని అంటున్నారు. ఎంత మంచి స్నేహితుడైనా సినిమా విషయానికి వచ్చేసరికి మహేశ్ ..మొహమాటాలకు వెళ్లడని అర్థమవుతుందంటూ అందరూ అనుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments