‘ఆకాశ‌వాణి’ నుండి కార్తికేయ త‌ప్పుకోడానికి కార‌ణ‌మదేనా?

  • IndiaGlitz, [Saturday,May 09 2020]

చాలా రోజుల క్రితం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ ‘ఆకాశవాణి’ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. గుణ్ణం గంగ‌రాజు త‌న‌య‌డుఉ అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌కుడిగా, అలాగే సింగ‌ర్, ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు కాళ‌భైర‌వ ఈ చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కొన్ని నెల‌ల క్రిత‌మే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కూడా విల‌క్ష‌ణ న‌టుడు స‌ముద్ర ఖ‌ని ఇందులో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. దాదాపు షూటింగ్ అంతా పూర్త‌య్యింది. ఈ త‌రుణంలో ఈ సినిమా నిర్మాణం నుండి కార్తికేయ త‌ప్పుకున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. ఈ త‌రుణంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

కొన్ని ఆలోచ‌న‌ల‌తో ముందుకు సాగామ‌ని అయితే ద‌ర్శ‌కుడికి ఆలోచ‌న‌ల‌కు, త‌న‌కు పొంతన కుద‌ర‌డం లేద‌ని త‌న ఆలోచ‌న‌ల‌తో ప్రాజెక్ట్‌ను దెబ్బ‌తీయ‌డం ఇష్టం లేక‌పోవ‌డంతో తాను త‌ప్పుకుంటున్న‌ట్లు కార్తికేయ తెలిపారు. అలాగే మ‌రో సినిమాకు కూడా తాను లైన్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నాన‌ని రెండు సినిమాల‌ను బ్యాలెన్స్ చేయ‌లేపోతున్నాన‌ని కార్తికేయ తెలిపారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ చిత్ర యూనిట్‌కు, మ‌రో నిర్మాత ప‌ద్మ‌నాభ‌రెడ్డి , ద‌ర్శ‌కుడు అశ్విన్‌కు అభినంద‌నలు తెలిపారు.

More News

ఇట‌లీ `రెడ్‌` ట్రిప్ క‌ళ్ల‌ముందు మెదులుతోంది! : 'స్ర‌వంతి' ర‌వికిశోర్‌

``కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను అవ‌త‌లివాళ్లు చెబుతుంటే ఆశ్చ‌ర్యంగా ఉంటుంది. మ‌రికొన్నిసార్లు న‌మ్మ‌బుద్ధి కాదు. ఆ మాట‌ల్లో అతిశ‌యోక్తులు ధ్వ‌నిస్తాయి. కానీ అలాంటిసంఘ‌ట‌న‌లు

విశాఖ గ్యాస్ లీకేజ్‌పై ఎల్జీ పాలిమర్స్ సుధీర్ఘ వివరణ..

విశాఖపట్నంలోని ఎల్జీపాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద ఇటీవల జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది చెందగా.. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఏపీలో తగ్గని కరోనా ఉధృతి.. 2వేలకు చేరువలో కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. కర్నూలు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అయితే కేసులు సంఖ్య

కోలీవుడ్‌ నటులకు ఏమైంది.. ఈ వివాదాలేంటి!?

కోలీవుడ్ నటులు వివాదాల్లో మునిగి తేలుతున్నారు. వివాదాలంటే దూరంగా ఉండే నటులు సైతం అదెలా ఉంటుందో చూడాలని ఇలా చేస్తున్నారేమో కానీ ఇటు మీడియాలో..

పాన్ ఇండియా మూవీ ‘83’కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపిన క‌బీర్‌ఖాన్‌

ఇండియన్ క్రికెట్‌ను గ‌తిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భార‌త‌దేశం క్రికెట్ ప్ర‌పంచంలో రారాజుగా అవ‌త‌రించింది. క‌పిల్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజ‌యంతో చాలా మందికి క్రికెట్