జనతా గ్యారేజ్ మూవీ రిలీజ్ వాయిదాకి కారణం ఇదే..
- IndiaGlitz, [Friday,July 15 2016]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రాన్నిమైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రాన్ని ఆగష్టు 12న రిలీజ్ చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే...తాజాగా జనతా గ్యారేజ్ చిత్రాన్ని సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ...జనతా గ్యారేజ్ చిత్రాన్ని ఆగష్టు 12న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ..పోస్ట్ ప్రొడక్షన్ కి కొంచెం ఎక్కువ టైమ్ కావాలి. అందుచేత ఆగష్టు మొదటివారంలో ఆడియోను, సెప్టెంబర్ 2న చిత్రాన్నిరిలీజ్ చేయనున్నాం అన్నారు.
డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ... ఆగష్టు 12న జనతా గ్యారేజ్ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే...వర్షాల వలన షూటింగ్ అప్ సెట్ అయ్యింది. దీంతో ఆగష్టు 12న సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి టైమ్ సరిపోవడం లేదు. ఇంత కష్టపడి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ హడావిడిగా చేయడం కరెక్ట్ కాదనిపించింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు మంచి కంటెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతోనే ఆగష్టు 12న కాకుండా సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ రిలీజ్ చేయాలని నిర్ణయించాం.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తాడు. సినిమా పోస్ట్ పోన్ చేయడంతో ఫ్యాన్స్ నిరాశపడచ్చు కానీ...సినిమా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఈ కథ మోహన్ లాల్ కి చెప్పినప్పుడు ఆయనే...ఎన్టీఆర్ ని మలయాళం ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఈ సినిమా కరెక్ట్ అని చెప్పారు. టీజర్ కి మలయాళంలో కూడా చాలా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఎన్టీఆర్, మోహన్ లాల్ లను తెర పై చూడడం ఆడియన్స్ కి ఒక ట్రీట్ లా ఉంటుంది. ఇంకా ఓ పదిరోజులు షూటింగ్ మిగిలి ఉంది. కేరళలో ఒక పాట చిత్రీకరించాలి. ఆగష్టు ఫస్ట్ వీక్ కి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆడియో రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలో డేట్ ఎనౌన్స్ చేస్తాం. సినిమాను ప్రేమించే వాళ్లందరికీ జనతా గ్యారేజ్ ఒక పండగలా ఉంటుంది అన్నారు.