Acharya Set:కోట్ల రూపాయలు బుగ్గిపాలు.. ఆచార్య సెట్‌లో అగ్నిప్రమాదానికి కారణం వాళ్లేనా..?

  • IndiaGlitz, [Tuesday,February 28 2023]

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సెట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి.. అవి క్షణాల్లో సెట్ మొత్తం వ్యాపించాయి. దీనిని గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు మంటలను అదుపుచేశారు. అయితే ఆచార్య షూటింగ్ ఎప్పుడో ముగియగా.. ప్రస్తుతం అక్కడ ఎవరూ వుండటం లేదు. మరి అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే అనుమానాలు నెలకొన్నాయి.

సిగరెట్ వల్లే ప్రమాదమా :

ఈ క్రమంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. సెట్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద కొందరు వ్యక్తులు ధూమపానం చేసినట్లుగా స్థానికులు అంటున్నారు. వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయిన కాసేపటికే మంటలు రాజుకున్నాయని అంటున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పాలని ప్రయత్నించినప్పటికీ.. సమీపంలో ఎక్కడా నీళ్లు లేవు. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చే వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. అప్పటికే సమయం మించిపోవడంతో సెట్ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. ప్రమాదం కారణంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది.

20 ఎకరాల్లో ధర్మస్థలి సెట్:

ధర్మస్థలి అనే గ్రామం, దేవాలయం చుట్టూ సాగే ఆచార్య కోసం కోట్ల రూపాయలు వెచ్చించి 20 ఎకరాల్లో ఈ సెట్ నిర్మించారు . ఇందుకోసం ఆర్ట్ డైరక్టర్, డైరెక్టర్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. సాధారణంగా కొన్ని సినిమాల సెట్స్‌ని .. షూటింగ్ పూర్తయ్యాక తొలగించకుండా అలాగే వుంచేస్తారు. వాటికి మార్పు చేర్పులు చేసి వేరే చిత్రాలకు ఉపయోగించుకుంటారు. ఆచార్య సెట్ కూడా ఇలాగే వదిలేసి వుండొచ్చని భావిస్తున్నారు.

చిరంజీవి కెరీర్‌లో డిజాస్టర్‌గా ఆచార్య:

ఇదిలావుండగా.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఆచార్య నిలిచిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీలో ఖైదీ నెంబర్ 150 ఘన విజయం సాధించగా.. తర్వాత చేసిన సైరా నర్సింహారెడ్డి నిరాశపరిచింది. దీంతో మెగా అభిమానులకు ఈసారి ట్రీట్ ఇవ్వాలని చిరు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా అపజయం ఎరుగని కొరటాల శివను దర్శకుడిగా ఎంచుకుని, ఫ్యాన్స్‌కు నచ్చే అన్ని ఎలిమెంట్స్‌ వుండేలా పక్కాగా ప్లాన్ చేశారు చిరు. దీనికి తోడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గెస్ట్ రోల్ చేయడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.

కోవిడ్, లాక్‌డౌన్‌ల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఆచార్య ఎట్టకేలకు ఏప్రిల్ 29, 2022న రిలీజ్ అయ్యింది. అభిమానులకు ఏమాత్రం ఎక్కకపోవడంతో తొలి షో నుంచే కలెక్షన్లు డల్ అయ్యాయి. రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. రూ.76 కోట్లు మాత్రమే తిరిగి రాబట్టి, తెలుగు చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.

More News

Pawan Kalyan : అప్పుడే స్పందించి వుంటే.. ఇలా జరిగేదా : డాక్టర్ ప్రీతిపై పవన్ దిగ్భ్రాంతి

సీనియర్ విద్యార్ధి వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

BTech student:ప్రీతి మరణం మరవకముందే.. వేధింపులకు మరో విద్యార్ధిని బలి, మళ్లీ వరంగల్‌లోనే

వరంగల్ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్ధిని డాక్టర్ ప్రీతి మరణం నుంచి తేరుకోకముందే.. అదే వరంగల్ జిల్లాలో మరో విద్యార్ధిని బలైంది.

K Viswanath : భర్త అడుగుజాడల్లో భార్య.. కే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ కన్నుమూత

రోజుల వ్యవధిలో కళాతపస్వి కే.విశ్వనాథ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి జయలక్ష్మీ (86)కన్నుమూశారు.

Doctor Preethi : ముగిసిన ప్రీతి పోరాటం.. చికిత్స పొందుతూ మరణించిన వైద్య విద్యార్ధిని, నిమ్స్ డాక్టర్ల ప్రకటన

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి కన్నుమూశారు.

Errabelli Dayakar:ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వోద్యోగం : మంత్రి ఎర్రబెల్లి హామీ

సీనియర్ విద్యార్ధి వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి కన్నుమూసిన సంగతి తెలిసిందే.