చాయ్‌వాలాగా మారిన దీదీ.. ఎందుకిలా!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి చాయ్‌వాలా అంటే టక్కున గుర్తొచ్చేది నరేంద్ర మోదీ కదా..? దీదీ అంటున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాయ్‌వాలాగా మారిపోయారు.. ఎందుకిలా అని అడిగితే పెద్ద కథే చెప్పుకొచ్చారండోయ్! ఆమె ఎందుకిలా మారారో..? అనేది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
దీదీ సరదా!
రోజు మాదిరిగానే కార్యక్రమాలను ముగించుకున్న దీదీ.. దిఘాలోని దత్తాపూర్ గ్రామంలో కొద్దిసేపు ఆగి అక్కడి ప్రజలతో ముచ్చటించి అనంతరం ఓ టీ స్టాల్‌కు వెళ్లారు. అలసిపోయిన ఆమెకు టీ తాగాలి అనిపించిందేమో కానీ.. స్వయంగా టీ తయారు చేసిన ఆమె తాగి.. అనంతరం సహచరులకు కూడా అందజేశారు దీదీ. అంతేకాదు.. అసలు టీ తయారిలో ఏమేం వాడుతారంటూ.. టీ కొట్టు యజమానిని అడిగి మరీ తెలుసుకున్న ఆమే స్వయంగా తయారు చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. అంతేకాదండోయ్.. కిచెన్‌లో వంట చేయడం దీదీ చాలా సరదా అంట. అయితే పొలిటికల్ ఎంగేజ్ మెంట్స్‌తో మిస్సవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దు చేసిన మమతా బెనర్జీ.. ఆ చిన్నారి తల్లికి కప్ కేక్ తాగించారు. ఈ విషయాలను తన ట్విట్టర్లో రాసుకొచ్చారు దీదీ.
దీదీ ఆసక్తికర ట్వీట్..
"ఒక్కోసారి జీవితంలో మనం చేసే చిన్నపాటి సంతోషాలే.. చిన్న పనులే మనల్ని ఎంతో ఆనంద పరవశుల్ని చేస్తుంటాయి. వీటిలో రుచికరమైన ‘టీ’ తయారు చేయడం కూడా ఒకటి. దత్తాపూర్ లోని దిఘాలో నేనిదే చేశాను’ అని దీదీ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఈమె ట్వీట్‌కు పలువురు కార్యకర్తలు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout