క్యాపిటల్స్ వరుస ఓటమికి కారణాలివే!
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు వరుసగా ఓటమి పాలవ్వడంతో అటు క్రీడాభిమానులు.. ఇటు నిర్వాహకులు తీవ్ర అసంతృప్తి ఉన్నారు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆరంభం మొదలుకుని అన్ని తప్పటడుగులతో చేజేతులారా మ్యాచ్‌ని సన్‌రైజర్స్ చేతికిచ్చారు. శ్రేయాస్ అయ్యర్ (41 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) పరుగులతో ఒక్కడే పోరాడగలిగాడు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు.
దీంతో.. ఐపీఎల్ తాజా సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. అయితే వరుస ఓటములపై క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఈజీగా గెలిచే మ్యాచ్‌లను ఇలా చేజేతులారా చేజార్చుకోవడంతో నిరాశం గురిచేసిందని ఒకింత ఆవేదనకు లోనయ్యాడు.
సపోర్ట్ లేక..!!
ముఖ్యంగా బౌలింగ్‌ను పూర్తిగా ప్రత్యర్థులు అర్థం చేసుకోవడం.. బౌలింగ్ సక్సెస్ కాకపోయినప్పటికీ బ్యాటింగ్‌లో అనుకున్నంతగా రాణించలేకపోవడం టీమ్ ఓటమికి మొదటి కారణమని అయ్యర్ స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా టాప్ ఆర్డర్ అట్టర్ ప్లాప్ అయ్యిందని.. మరోవైపు తనకు ఎవరూ సపోర్టు నిలవలేకపోయారన్నారు.
అయితే ఒక్కరైనా తనకు సపోర్టు ఉండి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. రానున్న మ్యాచ్‌లలో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నించి కచ్చితంగా సక్సెస్ అవుతామని అయ్యర్ చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా అనుకున్నంతగా బ్యాటింగ్ గానీ.. బౌలింగ్‌గానీ క్యాపిటల్స్ చేయలేదనే క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే మున్ముంథు జరిగే మ్యాచ్‌లకు కసరత్తు చేసి ఏ మాత్రం గెలుస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout