మగవారికే ‘కరోనా’ ఎక్కువగా సోకడం వెనుక..!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ థాటికి ప్రపంచ దేశాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు రోజురోజుకు పాజిటివ్ కేసులు.. అనుమానితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవన్నీ అటుంచితే.. కరోనా వైరస్‌కు ఇంతవరకూ మందు లేదు. అసలు మందు ఎప్పుడు తయారవుతుందో కూడా తెలియట్లేదు. ఓ వైపు కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతుండటం.. మరోవైపు కరోనా మృతులతో కొన్ని కొన్ని దేశాలు శవాల దిబ్బగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే కరోనాకు సంబంధించి కొత్త కొత్త విషయాలు.. కొత్త లక్షణాలు వెలుగు చూడగా.. తాజాగా ఓ షాకింగ్ వార్త వెలుగు చూసింది.
ఎందుకిలా..!?
అదేమిటంటే.. కరోనా ఎక్కువగా సోకేది మగవారికేనట. తాజాగా జరిగిన అధ్యయనాల్లో ఈ విషయం వెలుగుచూసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ మహిళల కంటే పురుషులకే ఎక్కువగా సోకుతోందని అందుకు చాలానే కారణాలు ఉన్నాయట. అసలు పురుషులకే ఎందుకు ఎక్కువగా కరోనా సోకుంతోందని అధ్యయనాలు ప్రారంభించగా.. ఈ విషయం వెలుగు చూసిందట. ఇదే విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే 71% శాతం మగవారే ఈ వైరస్ బారిన పడ్డారని వరల్డ్ మీటర్ వెబ్ సైట్లో తెలిపింది. అంతేకాదు మరణించిన వారిలో 30% పురుషులు ఉన్నారు. మహిళల్లో, పిల్లల్లో కరోనా రిస్క్ తక్కువ. గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు, శ్వాసకోశ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులున్నవారు ఎక్కువగా ఈ కరోనా వైరస్ బారీన పడి మృత్యువాత పడుతున్నారు. ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధి ఉన్నవారే ఈ వైరస్‌కు మొదట శత్రువట.
ఏం చేయబోతున్నారు..!?
అయితే.. మహిళలకు ఎక్కువగా సోకట్లేదు..? మహిళల్లో ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లు వారి పాలిట రక్షణ కవచంలా ఉంటున్నాయా? అనే విషయంపై ప్రయోగాలు సాగాయి. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో వైరస్ సోకిన పురుషులకు రోగనిరోధక శక్తిని పెంచే క్రమంలో ఈస్ట్రోజెన్స్ హార్మోన్‌ను ఇస్తున్నట్లు శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. లాస్ ఏంజెలెస్‌లో మరికొందరికి వచ్చేవారం ప్రొజిస్టిరాన్ హర్మోన్ ఇవ్వబోతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధనల వల్ల ఉపయోగం ఉంటుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com