మగవారికే ‘కరోనా’ ఎక్కువగా సోకడం వెనుక..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ థాటికి ప్రపంచ దేశాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు రోజురోజుకు పాజిటివ్ కేసులు.. అనుమానితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవన్నీ అటుంచితే.. కరోనా వైరస్‌కు ఇంతవరకూ మందు లేదు. అసలు మందు ఎప్పుడు తయారవుతుందో కూడా తెలియట్లేదు. ఓ వైపు కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతుండటం.. మరోవైపు కరోనా మృతులతో కొన్ని కొన్ని దేశాలు శవాల దిబ్బగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే కరోనాకు సంబంధించి కొత్త కొత్త విషయాలు.. కొత్త లక్షణాలు వెలుగు చూడగా.. తాజాగా ఓ షాకింగ్ వార్త వెలుగు చూసింది.

ఎందుకిలా..!?

అదేమిటంటే.. కరోనా ఎక్కువగా సోకేది మగవారికేనట. తాజాగా జరిగిన అధ్యయనాల్లో ఈ విషయం వెలుగుచూసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ మహిళల కంటే పురుషులకే ఎక్కువగా సోకుతోందని అందుకు చాలానే కారణాలు ఉన్నాయట. అసలు పురుషులకే ఎందుకు ఎక్కువగా కరోనా సోకుంతోందని అధ్యయనాలు ప్రారంభించగా.. ఈ విషయం వెలుగు చూసిందట. ఇదే విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే 71% శాతం మగవారే ఈ వైరస్ బారిన పడ్డారని వరల్డ్ మీటర్ వెబ్ సైట్‌లో తెలిపింది. అంతేకాదు మరణించిన వారిలో 30% పురుషులు ఉన్నారు. మహిళల్లో, పిల్లల్లో కరోనా రిస్క్ తక్కువ. గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు, శ్వాసకోశ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులున్నవారు ఎక్కువగా ఈ కరోనా వైరస్ బారీన పడి మృత్యువాత పడుతున్నారు. ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధి ఉన్నవారే ఈ వైరస్‌కు మొదట శత్రువట.

ఏం చేయబోతున్నారు..!?

అయితే.. మహిళలకు ఎక్కువగా సోకట్లేదు..? మహిళల్లో ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లు వారి పాలిట రక్షణ కవచంలా ఉంటున్నాయా? అనే విషయంపై ప్రయోగాలు సాగాయి. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో వైరస్ సోకిన పురుషులకు రోగనిరోధక శక్తిని పెంచే క్రమంలో ఈస్ట్రోజెన్స్ హార్మోన్‌ను ఇస్తున్నట్లు శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. లాస్ ఏంజెలెస్‌లో మరికొందరికి వచ్చేవారం ప్రొజిస్టిరాన్ హర్మోన్ ఇవ్వబోతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధనల వల్ల ఉపయోగం ఉంటుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More News

‘ఆచార్య’ నుంచి కాజల్ కూడా ఔట్.. ఇందుకేనా!

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. కరోనా లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది కానీ.. ఇప్పటికే సుమారు 70 శాతం

కరోనాకు వ్యాక్సిన్ రెడీ.. ఫస్ట్ ఇండియన్స్‌కే ఛాన్స్!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కరోనా వైరస్‌కు ఇంతవరకూ మందు లేదు. అసలు మందు ఎప్పుడు తయారవుతుందో కూడా తెలియట్లేదు.

కంటతడి పెట్టిస్తున్న ఇర్ఫాన్ చివరి మాటలు!

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన కేన్సర్‌తో బాధపడుతూ బుధవారం నాడు తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. 2018 మార్చి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న

శ్రుతికి ఆ వాస‌నంటే ఇష్ట‌మ‌ట‌!!

యూనివర్సల్ స్టార్ కమల్‌హాస‌న్ త‌న‌య శ్రుతిహాస‌న్ కొన్నాళ్ల పాటు ప్రేమ‌, బ్రేకప్ వంటి కార‌ణాల‌తో సినీ రంగానికి దూర‌మైంది. అయితే ఇప్పుడిప్పుడే సినీ రంగంలో మ‌రో ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది.

అమ్మ‌ల‌కు అంకితం: దేవిశ్రీ ప్ర‌సాద్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ‘బీ ద రియ‌ల్ మేన్‌’. క‌రోనా దెబ్బ‌కు దేశ‌మంత‌టా లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సినీ సెల‌బ్రిటీలంద‌రూ డిఫ‌రెంట్ ఛాలెంజ్‌ల‌ను విసురుకుంటున్నారు.