Chandrababu: సీఐడీ కార్యాలయాలకు వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ ఎందుకంటే..?

  • IndiaGlitz, [Saturday,January 13 2024]

టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. నేరుగా విజయవాడ తులసీనగర్‌లో ఉన్న సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఉచిత ఇసుక కేసులో అధికారులకు పూచీకత్తు, బాండ్ సమర్పించారు. మరోవైపు పార్టీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు. జై బాబు..జైజై బాబు నినాదాలతో హోరెత్తించారు. అధికారులు చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బయటకు వచ్చిన అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఓ చిన్నారిని ఎత్తుకుని కాసేపు సరదాగా గడిపారు.

అక్కడి నుంచి నేరుగా ఐఆర్ఆర్ కేసులో కుంచనపల్లి, మద్యం కేసులోనూ తాడేపల్లి సీఐడీ కార్యాలయాలకు వెళ్లి బాండ్లు సమర్పించారు. చంద్రబాబు తరపున టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు పూచీకత్తు సంతకాలు చేశారు. కాగా ఇన్నర్‌ రింగ్ రోడ్డుతో పాటు మద్యం, ఇసుక కేసుల్లో హైకోర్టు చంద్రబాబుకి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో లక్ష రూపాయల బాండ్లతో పాటు పూచీకత్తు అధికారులకు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాటిని సమర్పించేందుకు చంద్రబాబు ఆయా కార్యాలయాలకు వెళ్లారు.

మరోవైపు స్కిల్ డెలవప్‌మెంట్ కేసులో తనపై చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో ఆశ్రయించిన విషం విధితమే. ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తిస్తుందని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం గతేడాది అక్టోబర్ 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. అప్పటి నుంచి మూడు నెలల పాటు రిజర్వ్‌లో ఉన్న తీర్పును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈనెల 17న వెల్లడించనుంది. దీంతో ఈ తీర్పుపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

More News

Pandem Kollu: కాలు దువ్వుతున్న పందెంకోళ్లు.. చేతులు మారనున్న కోట్ల రూపాయలు..

సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు, ముగ్గులు, గొబెమ్మలు. ఇవే కాకుండా ముందుగా వినపడేది కోడిపందాలు.

First Day Collections: 'గుంటూరుకారం' వర్సెస్ 'హనుమాన్'.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం'బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మహేష్ వన్ మ్యాన్‌ షోతో అలరిస్తున్నాడు.

YS Sharmila: చంద్రబాబును కలిసిన షర్మిల.. కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానం..

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను కాంగ్రెస్ నాయకురాలు వైయస్ షర్మిల(YS Sharmila) కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని కోరుతూ చంద్రబాబు

Ram Charan-Upasana: రామ్‌చరణ్‌ దంపతులకు అయోధ్య నుంచి ఆహ్వానం

యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం మరో పది రోజుల్లో జరగనుంది. ఈ వేడుక కోసం అయోధ్య అందంగా ముస్తాబవుతోంది.

Nagarjuna: మహేశ్‌తో మల్టీస్టారర్ మూవీపై నాగార్జున ఏమన్నారంటే..?

ఈసారి సంక్రాంతి రేసులో కింగ్ నాగార్జున కూడా నిలిచిన సంగతి తెలిసిందే. 'నా సామిరంగ' మూవీతో భోగి రోజు ప్రేక్షకులను పలకరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించగా..