అతి త్వరలో విడుదలకానున్న రియలిస్టిక్ హారర్ ఎంటర్ టైనర్ 'ఆట'
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లామరస్ గర్ల్ శ్రద్ధదాస్ ముఖ్యపాత్రలో రూపొందిన రియలిస్టిక్ హారర్ థ్రిల్లర్ "ఆట". "గేమ్ నెవర్ ఎండ్స్" అనేది ఉపశీర్షిక. మాధురి ఇటాగీ, గాయత్రి, అవినాష్, రాజారవీంద్రలు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ జి.ఆర్ దర్శకత్వం వహించారు. వేగా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై విక్రమ్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.సుబ్రమణ్యం (బాబీ) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.సుబ్రమణ్యం (బాబీ) మాట్లాడుతూ.. "హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రెగ్యులర్ హారర్ సినిమాల్లా కాకుండా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. శ్రద్ధాదాస్, మాధురి ఇటాజీ, గాయత్రిల గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గ్లామర్ తోపాటు హారర్ ను సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్న పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని హారర్ ఎలిమెంట్స్ ను హ్యాండిల్ చేసిన విధానం, క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్ ఈ చిత్రాన్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాను" అన్నారు.
షాయాజీ షిండే, కాదంబరి జెత్వానీలు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వి.రవికుమార్, సంగీతం: హరి నికేష్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.సుబ్రమణ్యం, నిర్మాత: విక్రమ్ రాజు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజ్ కుమార్ జి.ఆర్!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments