'రీల్' వెర్సెస్ 'రియల్ ' మలుపు

  • IndiaGlitz, [Wednesday,February 17 2016]

నలుగురు స్నేహితుల మధ్య జరిగిన నిజ జీవిత కధను తీసుకొని, వాళ్ళ జీవితాన్ని అనుకోని విధంగా "మలుపు" తిప్పిన, ఆ "మలుపు" నే కధాంశంగా తీసుకుని, దర్శకుని విన్నూత్న శైలిని ట్రెయిలర్ లోనే చూబించిన చిత్రం "మలుపు".

తెలుగులోనూ ఫాలోయింగ్ ఉన్న తమిళం లో ఫేమస్ అయిన, తెలుగు హీరో, ఫేమస్ డైరెక్టర్ "రవి రాజా పినిశెట్టి" రెండో అబ్బాయి, ఆదీ పినిశెట్టి హీరోగా, ఈయన సోదరుడు, సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకుడిగా తమిళంలో , తెలుగులో "మలుపు"గా వస్తోంది, ఈ నెల 19న.

చిత్ర కధాంశంలో, హీరో, అతని ముగ్గురు స్నేహితుల పాత్రలతో పాటు నాయిక నిక్కీ గర్లాని, ప్రతినాయకుడు సీనియర్ నటుడు మిధున్ చక్రవర్తీ పాత్రలు హైలైట్ అవ్వనున్నాయని అంటున్నారు, "మలుపు" చిత్ర యూనిట్. ఇండస్ట్రీ ఆడియన్స్, తెలుగు ఫిలిం ఆడియన్స్ లో హాట్ టాపిక్ గా మారిన "మలుపు" సినిమాకు సంబంధించి, మరో సస్పెన్స్, పోస్టర్ రూపంలో వీడింది.
నిజ జీవిత కధ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలోని నాలుగు కీలక పాత్రల లుక్, ఈ కధను తమ జీవితంలో అనుభవించిన నలుగు కుర్రాళ్ళు ఎలా ఉంటారో పరిచయం చేస్తూ, ఒక పోస్టర్ రిలీజ్ చేసారు "మలుపు" టీం. నిజ జీవిత కధలను, గాధలను ఆధారంగా చేసుకొని, ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు ఒచ్చినా, ఈ తరహా ఆలోచన, ఖచ్చితంగా ఇంతకు మునుపు ఎవ్వరికీ రాలేదు.

More News

'తుంటరి' ఆడియో రిలీజ్ డేట్

కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం 'తుంట‌రి'.బాణం,సోలో, సారొచ్చారు,ప్ర‌తినిధి,రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్‌.తాజాగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ లో ఆయ‌న న‌టిస్తున్న ‘తుంటరి’ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ పĺ

సమంత షరతులు

టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా చెలామణి అవుతున్న హీరోయిన్ సమంత ఇప్పుడు తెలుగులో నితిన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) చిత్రంలో నటిస్తుంది.

సుప్రీమ్ రిలీజ్ డేట్....

పిల్లా నువ్వులేని జీవితం’,‘సుబ్రమణ్యం ఫర్ సేల్’చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రపొందుతోన్న చిత్రం ‘సుప్రీమ్’.

చిరు చిన్న‌ల్లుడు ఇత‌నే

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ వివాహం చేసుకోవ‌డం..ఆత‌ర్వాత విడాకులు తీసుకోవ‌డం తెలిసిందే. అయితే... చిరుకి ప్రాణ‌మైన రెండో కుమార్తె శ్రీజ‌కి రెండో వివాహాం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

స్నేహితుడికి నితిన్ సపోర్ట్

ఇప్పుడున్న తరం హీరోలు ఒకరితో ఒకరు కలివిడిగానే ఉంటున్నారు. చాలా ఆడియో వేడుకలు, సక్సెస్ మీట్స్ లో ఈ విషయాలు మనకు తేటతెల్లమయ్యాయి.