వాస్తవ ఘటన ఆధారంగా 'రాజా మీరు కేక'
Send us your feedback to audioarticles@vaarta.com
గుంటూరు టాకీస్ చిత్రాన్ని నిర్మించిన ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్‌పై రేవంత్, నోయల్, హేమంత్, లాస్య, శోభిత ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'రాజా మీరు కేక'. కృష్ణ కిషోర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 16న విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణ కిషోర్ పాత్రికేయులతో మాట్లాడారు..
సినిమా వైవిద్యంగా ఉంటుంది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.ఇప్పుడు సోసైటీలో జరుగుతున్న ఓ బర్నింగ్ ఇష్యూని బేస్ చేసుకుని తీశాం. నెల్లూరులో జరిగిన ఓ వాస్తవ ఘటనను కథగా మలిచి సినిమాగా తీశాను. విలువలతో పెరిగిన కుర్రాళ్లు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ఎలా `రాజా మీరు కేక` అని అనిపించుకుంటారన్నది ఆసక్తికరం. సాప్ట్ వేర్ కంపెనీలు ఎప్పుడు మూతపడుతున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. అలాంటి నేపథ్యాన్ని కూడా సినిమాలో చూపిస్తున్నాను.
ఏ ఒక్క కంపెనీనో ఉద్దేశించి తీసిన సినిమా కాదు. స్నేహం, కుటుంబం, కామెడీ, థ్రిల్, అన్నీ ఇందులో ఉంటాయి. తారకరత్న సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా నటించారు. పృథ్వి, పోసాని, గుండు సుదర్శన్ చేసిన సన్నివేశాలు గొప్పగా ఉంటాయి. లాస్య పాత్ర ఏడిపిస్తుంది, నవ్విస్తుంది. ఆ అమ్మాయి చాలా బాగా నటించింది. శోభిత అనే పాత్రధారి కూడా చాలా బాగా నటించింది. నా సినిమాను చూసి సురేశ్‌బాబుగారు, సాయి కొర్రపాటిగారు, కె.కె.రాధామోహన్‌గారు మంచి కథ ఉంటే చెప్పమన్నారు అంటూ చెప్పుకొచ్చారు కృష్ణ కిషోర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com