మహేష్ ఆలస్యానికి అసలు కారణమిదే..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్నస్పై థ్రిల్లర్ `స్పైడర్`. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. నిజానికి సినిమాను జూన్ 23న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ఉన్నట్లుండి సినిమా విడుదలను వాయిదా వేశారు. వాయిదా వేయడానికి పలు కారణాలు ఫిలింనగర్ వర్గాల్లో వినపడ్డాయి. కానీ అసలు విషయం ఏంటంటే స్పైడర్ క్లైమాక్స్, రీసెంట్‌గా తమిళంలో విడుదలైన `కవన్` అనే తమిళ సినిమా క్లైమాక్స్ ఒకేలా ఉండటమే అందుకు కారణమని, ఈ విషయం తెలిసిన దర్శక నిర్మాతలు క్లైమాక్స్‌ను రీ రైట్ చేశారట. రీ రైట్ చేసిన క్లైమాక్స్‌ను మే 2 నుండి మే నెలాఖరు వరకు షూట్ చేస్తారట. సినిమాను జూలై లేదా ఆగస్టులో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com