రియల్ హీరో అనిపించుకున్న ‘రేసుగుర్రం’ విలన్!

  • IndiaGlitz, [Sunday,August 04 2019]

ఇండియాలో చాలా చిత్రవిచిత్రమైన రాజకీయ నేతలను మనం చూసే ఉంటాం.. కనీసం వార్తల్లో అయినా ఫలానా నేత ఇలా చేశారు.. అలా చేశారని వార్తల్లో అయినా చూసే ఉంటాం. అయితే రాజకీయాల్లో మంచి చేయాలి.. ప్రజా సేవ చేసి వారి గుండెల్లో చోటు దక్కించుకోవాలన్న మనస్సు అతి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది.. ఇది ఎవరు ఏమనుకున్నా జగమెరిగిన సత్యం. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చామా..? మన పనులు చూసుకున్నామా..? అంతే.. అసలు తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎలా ఉన్నారు..? వారికి ఏం కావాలి..? నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి..? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనేది అస్సలుండదు.. అయితే మళ్లీ 5 ఏళ్లకు జనాల దగ్గరికెళ్లి దండాలు మాత్రం పెట్టి సపర్యలు చేస్తామని వాగ్దానాలు ఇస్తుంటారు.

మనసు గెలిచిన విలన్!

అయితే సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రేసుగుర్రం విలన్.. రవి కిషన్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే రాజకీయాల్లోకి ఈయన ఎంట్రీ కాంగ్రెస్‌తో జరిగినప్పటికీ ఫస్ట్ టైమ్ పోటీచేసి ఫెయిలయ్యారు. అయితే ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న రవికి అధిష్టానం గోరఖ్‌పూర్ ఎంపీ టికెట్ ఇచ్చింది.. కష్టపడి గెలిచి నిలిచారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టిన మరుసటి రోజే అందరి మనసులు గెలుకుని ఉభయసభల్లో హాట్ టాపిక్ అయ్యారు.

శభాష్ రవి..!

తాజాగా.. రవి కిషన్ చేసిన ఓ మంచి పనికి దేశం మొత్తం ఆయన పేరు మార్మోగుతోంది. ఇటీవల తన ఇంటి నుంచి పార్లమెంట్‌గా వెళ్తుండగా జోరు వాన కురుస్తోంది. స్కూల్‌కు వెళ్తున్న పిల్లల వాహనం ప్రమాదంలో చిక్కుకుంది. అయితే భయాందోళనకు గురైన పిల్లలు అరుపులు, కేకలు వేశారు. అటుగా వెళ్తున్న ఎంపీ రవి చెవిన పడటంతో చలించిపోయిన ఆయన.. వెంటనే తన డ్రైవర్‌తో కారును ఆపించి వారిని తన సిబ్బందితో స్కూల్‌ దగ్గరికి తీసుకెళ్లి వారికి సపర్యలు చేశారు. వాళ్లు సురక్షితంగా గమ్యస్థానం చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు.

మీరు విలన్ కాదు.. రియల్ హీరో!

కాగా.. రవికిషన్ మంచిపనికి సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శభాష్ సార్.. మీరు రీల్ లైఫ్‌లోనే విలన్.. రియల్ లైఫ్‌లో నిజంగానే హీరో సార్ అని మెచ్చుకుంటున్నారు. మరికొందరు శభాష్ రేసుగుర్రం విలన్.. మా మనసు గెలిచావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన పిల్లలతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిజంగా మీలాంటి వారే సార్.. రాజకీయాల్లోకి రావాల్సింది.. కావాల్సింది అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More News

పునర్నవీని డేట్‌కు పిలిచిన రాహుల్.. రియాక్షన్ ఇదీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-03 ఇప్పటి వరకూ గొడవలతో అరుపులతో ఎపిసోడ్ ముగిసిపోయేది. అయితే శుక్రవారం మాత్రం ఈ షో చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకున్నారు.

తీన్మార్ సావిత్రి ప్రేమ కథ.. కన్నీటి ప్రవాహమే!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-03 ఇప్పటి వరకూ గొడవలతో అరుపులతో ఎపిసోడ్ ముగిసిపోయేది. అయితే శుక్రవారం మాత్రం ఈ షో చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకున్నారు.

టీడీపీకి దేవినేని రాజీనామా.. జగన్ సమక్షంలో వైసీపీలోకి!

తెలుగు యువత అధ్యక్షుడు, మంత్రిగా కొడాలి నానినే ఢీ కొన్న నేత దేవినేని అవినాష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.!

రాజకీయాలకు ‘ఇక సెలవు’ అంటున్న కుమారన్న!

అవును మీరు వింటున్నది నిజమే.. కర్నాటక మాజీ సీఎం హెచ్‌ డీ కుమారస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఓ మూర్ఖపు భక్తుల్లారా.. రాముడి పేరును అపవిత్రం చేయకండి..!

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ మతం ఆధారంగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.