పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా.. ‘రియల్ హీరో’
Send us your feedback to audioarticles@vaarta.com
రీల్ పరంగా విలన్.. రియల్‌గా మాత్రం దేశమంతా మెచ్చిన హీరో సోనూసూద్. లాక్‌డౌన్ ప్రారంభమైంది మొదలు.. నేటి వరకూ ఎవరు సాయమడిగినా వెనుకాడింది లేదు. అందుకే ఆయన జనం గుండెల్లో రియల్ హీరో అయిపోయారు. కరోనా గురించి పెద్దగా అవగాహన లేని సమయంలో అందరూ ఇంటికే పరిమితమైతే ఈ రియల్ హీరో మాత్రం బయటికి వచ్చి ప్రజానీకానికి విశిష్ట సేవలందించి.. వలస కూలీల పాలిట దేవుడయ్యాడు. దీంతో సోనూకి మరో అరుదైన గౌరవం దక్కింది.
ఇప్పటికే సోనూసూద్ దయాగుణానికి ఎన్నో ప్రశంసలు, అవార్డులు లభించాయి. పంజాబ్‌కు చెందిన సోనూను ఆయన రాష్ట్రం అద్భుతంగా గౌరవించింది. తాజాగా సోనూను పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా నియమిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ప్రజల చేత రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్‌ని ప్రస్తుతం పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా నియమించాం’ అని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ట్వీట్ చేశారు.
కాగా.. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సోనూ సూద్ ఆటోబయోగ్రఫీ రాస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీనికి మీనా అయ్యర్ రచయితగా వ్యవహరిస్తున్నారు. ‘ఐయామ్ నో మెసయ్య’ అనే టైటిల్‌తో ఈ ఆటోబయోగ్రఫీ సిద్ధమవుతోంది. వచ్చే నెల అంటే డిసెంబర్‌లోనే ఈ ఆటోబయోగ్రఫి విడుదల కానుంది. దీనిపై స్పందించిన సోనూ.. ప్రజలు తనపై ప్రేమతో ‘మెసయ్య’ అని పిలుస్తున్నారని.. నిజానికి తాను రక్షకుడిని కానని.. మనసు చెప్పిందే చేశానని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments