విజయ్ సేతుపతిలా చేయడానికి సిద్ధం.. కాకపోతే..: అల్లరి నరేష్
Send us your feedback to audioarticles@vaarta.com
‘అల్లరి’ నరేష్ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది కామెడీ. జూనియర్ రాజేంద్రప్రసాద్‌లా పేరు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం రూటు మార్చేశాడు. నిజానికి ‘గమ్యం’తోనే మార్చినప్పటికీ.. మళ్లీ కామెడీ జోనర్లోకి వెళ్లిపోయాడు. కానీ ‘మహర్షి’ నుంచి మాత్రం కంప్లీట్‌గా ట్రాక్ మార్చేశాడు. ఈ క్రమంలోనే చేసిన సినిమా ‘నాంది’. సీరియస్ కథాంశంతో సాగే ఈ సినిమా తనకు మరో ‘గమ్యం’ వంటి సక్సెస్‌ను అందిస్తుందని అల్లరి నరేష్ నమ్ముతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి అలాగే తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అల్లరి నరేష్ మీడియాతో పంచుకున్నాడు.
నా ఆలోచనా విధానం మారింది..
‘అల్లరి’తో తన కెరీర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి కామెడీ సినిమాలపైనే ఫోకస్ చేశా. దర్శక, నిర్మాతలు కూడా అదే తరహా కథా చిత్రాలతోనే నా వద్దకు వచ్చేవారు. అలాంటి సమయంలో ఓసారి విజయ్ కనకమేడల ‘నాంది’ కథతో నా వద్దకు వచ్చారు. ఈ కథకు నేను న్యాయం చేయగలనని నిర్మాతలు నమ్మడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ల ఎంపిక విషయంలో నా ఆలోచనా విధానం కొంతమేర మారింది. ‘నాంది’ సినిమా పట్టాలెక్కినప్పుడే.. ఇది సీరియస్ ఫిల్మ్ అని అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాం. అదే విధంగా పోస్టర్లు, టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందని నమ్ముతున్నా.
‘నాంది’ కోసం శారీరంకగా కష్టపడ్డా..
‘లడ్డూబాబు’కు మేకప్ విషయంలో ఎంతో కష్టపడ్డా. దాదాపు ఐదు గంటలు మేకప్ కోసమే కేటాయించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ‘నాంది’ కోసం శారీరకంగా కష్టపడ్డా.. నేను తలకిందులుగా వేలాడుతున్నట్లు ఉన్న పోస్టర్ చూసే ఉంటారు కదా.. ఆ సీన్ షూట్ చేయడానికి ఆరు గంటలు పట్టింది. మా సినిమాలో చట్టాల గురించి చూపించాం. ముఖ్యంగా ఓ సెక్షన్ గురించి చెప్పాం. కథ విన్నా తర్వాత ఆ సెక్షన్ గురించి గూగుల్ చేసి తెలుసుకున్నా. సినిమా విడుదలయ్యాక చాలా మంది కూడా నా లాగే గూగుల్ చేసి ఆ సెక్షన్ గురించి తెలుసుకుంటారని అనుకుంటున్నా.
బాలీవుడ్లో రీమేక్ చేసే అవకాశం...
వరలక్ష్మిని లేడీ విజయ్ సేతుపతి అని పిలుస్తుంటాను. ఒక హీరో కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆ అమ్మాయి.. కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే చేస్తాననకుండా అన్నిరకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇది నిజంగానే మెచ్చుకోవాల్సిన విషయం. ఆమె చాలా అద్భుతంగా నటిస్తోంది. కోలీవుడ్, బాలీవుడ్‌ల్లో ‘నాంది’ని రీమేక్ చేయడానికి కొంతమంది అడుగుతున్నారు. బాలీవుడ్లో రీమేక్ చేసే అవకాశాలున్నాయి. ‘గమ్యం’ సినిమాకు ఎంత నమ్మకంగా ఉన్నానో.. ‘నాంది’కి కూడా అంతే నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే మా టీమ్ అంత చక్కగా కుదిరింది. సాధారణంగా నా సినిమా ప్రీరిలీజ్ వేడుకల్లో టాలీవుడ్‌కు చెందిన యువ హీరోలందరూ సందడి చేసేవాళ్లు.
‘నాంది’ ప్రీరిలీజ్‌కు ఎవరూ రాలేదు..
కరోనా అనంతరం ఇటీవల షూట్స్ ప్రారంభం కావడంతో అందరూ వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. అదీకాక కరోనా భయం కూడా ఉంది కదా. అందుకే ‘నాంది’ ప్రీరిలీజ్‌కు ఎవరూ రాలేకపోయారు. సక్సెస్మీట్కు అందర్నీ తప్పకుండా పిలుస్తా. నా కెరీర్ ఆరంభం నుంచి హిట్, ఫ్లాప్‌లను చవిచూశాను. ‘సుడిగాడు’ తర్వాత కొన్ని ఫ్లాప్‌లు వచ్చాయి. కాబట్టి, ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు వరుసగా చేయడానికి బదులు ఒక్క హిట్ సినిమా చేసిన చాలు అనేది నా ఉద్దేశం. అందుకే మంచి కథా చిత్రాలపై ఫోకస్ చేస్తున్నా. విజయ్ సేతుపతిలాగా ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. హీరో, విలన్, సహాయనటుడు, మల్టీస్టారర్.. ఇలా ఏ పాత్ర అయినా ఓకే. అలాగే ఏ భాషా చిత్రమైనా సరే చేస్తా. కాకపోతే కథ నాకు నచ్చితే చాలు అని అల్లరి నరేష్ వెల్లడించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments