విలన్‌గా నటించేందుకు సిద్ధం - ఆదిత్య ఓం
Send us your feedback to audioarticles@vaarta.com
'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రంతో పరిచయమై దాదాపు 30 చిత్రాల్లో హీరోగా నటించారు ఆదిత్య ఓం. ఆదిత్య ఓం నటించి, దర్శకత్వం వహించిన 'ఫ్రెండ్ రిక్వెస్ట్' గత సంవత్సరం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆదిత్య ఓం విలన్ పాత్రలు, విలక్షణ పాత్రలు పోషించేందుకు సిద్ధమయ్యారు.
అక్టోబర్ 5 ఆదిత్య ఓం పుట్టినరోజు సందర్భంగా ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయంలో తనకు సీనియర్ నటులైన జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్‌లను ఆదర్శంగా తీసుకున్నట్టు తెలిపారు. హీరోగా ఒకటిన్నర దశాబ్దంగా తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు సదా కృతజ్ఞుడనై వుంటానని, ఇకపై విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం తనకు వుందని ఆదిత్య ఓం తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com