యుద్ధానికి మేం 'రెఢీ'.. భారత్‌కు పాక్ వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
పుల్వామా దాడి ఘటన అనంతరం ఫస్ట్ మీడియా ముందుకు వచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొసలి కన్నీరు కార్చారు. అదేదో సామెత ఉంది కదా.. చావు చెబితే.... ఇంకోదానికి వచ్చినట్లుగా దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత పాక్ ప్రధాని మీడియా ముందుకు రావడం గమనార్హం. ఉగ్రదాడితో తమకెలాంటి సంబంధం లేదని.. ఈ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తే లేదని.. మేం కూడా ఉగ్రమూకల బాధితులమేనన్నారు.
మేం కూడా సిద్ధమే..
"పుల్వామా ఉగ్రదాడి విషయంలో భారత్ మాపై అసత్య ప్రచారం చేస్తోంది. పాక్ ప్రభుత్వం గానీ, ఆర్మీ గానీ ఉగ్రవాదులకు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. పాకిస్థాన్ కూడా ఉగ్రదాడులతో సతమతమవుతోందన్న సంగతి ప్రపంచం గుర్తించాలి. భారత్ మాపై ఆరోపణలు చేయడం మానాలి. ఉగ్రదాడిపై ఆధారాలు చూపితే ఏమైనా చర్యలు తీసుకుంటాము. అలా కాదని మాపై దాడికి దిగితే మాత్రం ధీటైన సమాధానం చెప్పేందుకు పాక్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది" అని భారత్‌కు ఇమ్రాన్ హెచ్చరికలు జారీచేశారు.
తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో..!
"అయినా ఓ దేశం ఇలా చేసింది.. అలా చేసిందని మరో దేశం ఎలా చెప్పగలుగుతుంది?. ఓ జాతి మీద, ఓ దేశం మీద అన్యాయంగా ముద్ర వేస్తారా?. ఇలాంటి దాడిని పాకిస్థాన్ ప్రతిఘటిస్తుంది?. ఇండియా వైపు నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ తిప్పికొడుతుంది. యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం తేలికే కానీ ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండి. దాడి చేస్తారా.. అయితే మేమూ సిద్ధమే. యుద్ధం ప్రారంభించడం మీ చేతుల్లో ఉండొచ్చని, కానీ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు" అని ఒకింత రెచ్చగొట్టేలా పాక్ ప్రధాని వ్యాఖ్యలు చేయడంతో ఇండియన్ ఆర్మీ, కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో రగిలిపోతోంది. అయితే పాక్ వ్యాఖ్యలకు భారత ప్రధాని ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments